ఎన్నో అవార్డులను గెలుచుకున్న భారత ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ మరో అవార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ప్రతిష్టాత్మక 'ఇటాలియన్ గోల్డెన్ సాండ్ ఆర్ట్' అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారత వ్యక్తిగా చరిత్ర సృష్టించారు పట్నాయక్. రోమ్ నగరంలో ఈ వేడుక జరిగింది.
నవంబర్ 13 నుంచి 17 వరకు జరుగుతున్న ప్రముఖ 'ఇంటర్నేషనల్ స్కోరానో సాండ్ నేటివిటీ' కార్యక్రమంలో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించారు పట్నాయక్. రష్యా కళాకారుడు పావెల్ మినిల్కోవ్తో కలిసి 10 అడుగుల ఎత్తయిన మహత్మ గాంధీ సైకత శిల్పాన్ని రూపొందించారు. ఈ శిల్పానికిగాను ఆయనకు ఈ అవార్డు దక్కింది.