తెలంగాణ

telangana

ETV Bharat / international

రష్యా దాడిలో ఆరేళ్ల చిన్నారి మృతి.. కొన ఊపిరితో తండ్రి - ukraine girl dead in russia attack

Girl dead in russia attack: ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో సామాన్యులు సమిధలవుతున్నారు. రష్యా బలగాలు జరుపుతున్న కాల్పుల్లో చిన్నారులు, వృద్ధులు మరణిస్తున్నారు. మారియుపోల్‌లో ఆరేళ్ల చిన్నారి తీవ్ర గాయాలకు గురై మరణించడం అందరి హృదయాలను ద్రవింప జేస్తోంది. ఆ చిన్నారి మరణంతో వైద్య సిబ్బంది కూడా కన్నీటిపర్యంతమయ్యారు.

six year girl died in russian attack
రష్యా దాడిలో ఆరేళ్ల చిన్నారి మృతి.. కొన ఊపిరితో తండ్రి

By

Published : Feb 28, 2022, 10:56 AM IST

Ukraine girl dead: తమ దేశంలో ఏం జరుగుతుందో ఆ చిన్నారికి తెలియదు. వేల మంది సాయుధులు తమ భూభాగంలోకి వచ్చి ఎందుకు దాడి చేస్తున్నారో.. తెలియదు. కానీ ఎప్పటిలాగే తన ఇంట్లో ఆడుకుంటున్న ఆ చిన్నారి రష్య బలగాల దాడిలో తీవ్రంగా గాయపడి మరణించింది. తమ గారాలపట్టి తీవ్ర గాయాలతో అచేతనస్థితిలో పడిఉండడం చూసి ఆ తల్లి... భోరున ఏడ్చేసింది. తమ చిన్నారిని కాపాడాలంటూ వేడుకుంది.

Girl dead in russia war

ఉక్రెయిన్‌లోని ఓడ రేవు నగరమైన మారియుపోల్‌లో రష్యన్ బలగాల దాడిలో 6 ఏళ్ల బాలిక, ఆమె తండ్రి తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకొచ్చారు. చిన్నారిని రక్షించేందుకు వైద్య సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. వైద్యులు, నర్సులు చిన్నారి చుట్టూ చేరి చికిత్స చేస్తున్నారు. కానీ వైద్యుల ప్రయత్నాలు ఫలించ లేదు. ఆ చిన్నారి కన్నుమూసింది. ఈ విషాదంతో అక్కడే ఉన్న వైద్య సిబ్బంది కూడా కన్నీరు పెట్టుకున్నారు. ముద్దులొలికే చిన్నారి విగతజీవిగా పడి ఉండడం చూసి చలించి పోయారు. ఆ కోపంతో అక్కడే ఉన్న ఓ వైద్యుడు.. ఈ చిన్నారి మృతదేహాన్ని పుతిన్‌కు చూపించు అని వాపోయాడు. దాడిలో గాయపడ్డ ఆ చిన్నారి తండ్రి కూడా కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్నాడు.

చిన్నారిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించిన డాక్టర్లు
ప్రాణాలు కోల్పోయిన చిన్నారి భౌతికకాయం

ఇదీ చదవండి:తగ్గేదేలే అంటున్న ఉక్రెయిన్​.. పుతిన్‌ అంచనాలు తప్పాయా?

ABOUT THE AUTHOR

...view details