ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ.. వ్యాక్సిన్‌పై జరుగుతున్న ప్రయోగాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా వైరస్ వ్యాక్సిన్‌పై క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయినట్లు రష్యాలోని సెచెనోవ్ విశ్వవిద్యాలయం పేర్కొంది. వాలంటీర్లపై పరీక్షలు పూర్తయ్యాయని ఆ యూనివర్సిటీలోని ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌లేషనల్ మెడిసిన్ అండ్ బయో టెక్నాలజీ డైరెక్టర్ వాడిత్ తారాసోవ్ పేర్కొన్నారు.
" రష్యాకు చెందిన గమలీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయాలజీ ఉత్పత్తి చేసిన ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను జూన్ 18న ప్రారంభించారు. పరీక్షలు చేపట్టిన తొలిగ్రూప్ వాలంటీర్లు బుధవారం డిశ్చార్జి కానుండగా.. రెండో గ్రూప్ ఈ నెల 20న డిశ్చార్జి అవుతారు."