ఆర్కిటిక్ మహాసముద్రంలో ఐదు కొత్త ద్వీపాలనుకనుగొన్నారు రష్యన్ పరిశోధకులు . ఫ్రాంజ్ జోసెఫ్ ద్వీప సమూహంలోని మంచు కొండలు కరగడం వల్ల ఈ ద్వీపాలు ఏర్పడినట్లు వారు తెలిపారు. వీటికి ఇంకా పేరు పెట్టలేదన్నారు.
రష్యన్ జియోగ్రాఫికల్ సొసైటీ, రష్యన్ ఆర్కిటిక్ నేషనల్ పార్క్‌లతో కలిసి రష్యా నేవీ నార్నర్న్ ఫ్లీట్ అన్వేషణ చేపట్టింది. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో 44 రోజుల పాటు సాహస యాత్ర చేసి పరిశోధకులు ఈ ఐదు ద్వీపాలను కనుగొన్నారు. గత 30 ఏళ్లలో ఇది అతి పెద్ద ఆర్కిటిక్ యాత్రగా నిలిచింది.
అక్కడ జీవరాశి ఉంది..