Russia-Ukraine conflict: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు సమీపంలోని కీలకమైన విమానాశ్రయాన్ని హస్తగతం చేసుకున్నట్లు రష్యా సైన్యం ప్రకటించింది. దీంతో పశ్చిమ దేశాలతో కీవ్‌ను దూరం చేసినట్లు తెలిపింది.
హోస్టోమెల్లో అతిపెద్ద రన్‌వేతో కూడిన ఈ ఎయిర్‌పోర్ట్‌కు భారీ రవాణా విమానాలు వచ్చే అవకాశముంది. ఫలితంగా కీవ్ నగర శివార్లలో ఉన్న బలగాల్ని రాజధానికి తరలించడం రష్యాకు మరింత సులువు కానుంది. కీవ్‌కు వాయవ్య ప్రాంతంలో కేవలం 7 కిలోమీటర్ల దూరంలోనే హోస్టోమెల్ ఉంటుంది. రష్యా వాయుసేనకు చెందిన 200 హెలికాప్టర్లు.. హోస్టోమెల్లో దిగేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు ఆ దేశ రక్షణ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కొనషెంకోవ్.
వెయ్యి మంది సైనికులు మృతి..