Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు దిగి వారం పూర్తైంది. ఏడు రోజుల నష్టంపై పూర్తి స్థాయి అంచనాలు లేకున్నా, కళ్ల ముందు ఇప్పుడు విధ్వంసం తప్ప మరేమీ కనిపించడం లేదు. ఉక్రెయిన్ రాజధాని కీవ్, రెండో అతిపెద్ద నగరం ఖార్కివ్ శిథిల దిబ్బగా మారిపోయింది. ఆయా ప్రాంతాల్లో బాంబుల ధాటికి కాలి మసిబారి రూపు కోల్పోయిన భవనాలు, కూలిన వంతెనలు, దెబ్బతిన్న రహదారులే కనిపిస్తున్నాయి.
ఉక్రెయిన్‌లో రష్యా సైనికుల వాహనాలు హెలికాఫ్టర్ నుంచి తుపాకీ గురిపెట్టిన రష్యా సైనికుడు one week for Russia Ukraine war
రష్యా ధాటికి ఉక్రెయిన్ నిలవలేకపోతోంది. ఆత్యాధునిక బాంబులతో రష్యా విసురుతున్న నిప్పు గోళాల ధాటికి ఉక్రెయిన్‌లోని అందమైన ప్రాంతాలు, భవనాలు నామరూపాలు లేకుండా పోయాయి. రెండు దేశాల సైనికులు, పౌరుల ప్రాణ నష్టంపై కచ్చితమైన సమాచారం లేకున్నా.. తమ వైపు 2వేల మంది పౌరులు చనిపోయినట్లు ఉక్రెయిన్ అత్యవసర సేవల విభాగం తెలిపింది. సైనికుల నష్టంపై అంచనాలు లేవు. రష్యా కూడా ప్రాణ నష్టంపై మరో ప్రకటన చేసింది. ఉక్రెయిన్ సైనికులు 2,870 మంది చనిపోగా, 3,700 మంది గాయపడ్డారని రష్యా రక్షణ శాఖ తెలిపింది. తమ సైనికులు 498 మంది ప్రాణాలు కోల్పోయారని, ఒక 1,597 మంది గాయపడ్డారని రష్య ప్రకటించింది. అయితే రెండు వైపులా ప్రాణ నష్టం అంతకంటే ఇంకా ఎక్కువే ఉండవచ్చని అంచనా.
ఉక్రెయిన్‌లో రష్యా సైనికుల వాహనాలు స్వీడన్ గగనతలంలోకి చొరబడిన రష్యా యుద్ధవిమానాలు Russia invasion of Ukraine
ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడుల్లో సైనిక, నిఘా, ప్రభుత్వ భవనాలే కాకుండా నివాస ప్రాంతాలు, చివరకు ఆసుపత్రులు, విద్యా సంస్థలు, ప్రార్థనా స్థలాలు కూడా లక్ష్యంగా మారాయి. బుధవారం చెర్నిహైవ్ నగరంలో ఒక ఆసుపత్రిపై రెండు క్రూయిజ్ క్షిపణులతో రష్యా దాడి చేసింది. భవంతి దెబ్బతిన్నా నష్టం వివరాలు పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. ఖార్కివ్‌లోని నేషనల్ యూనివర్సిటీ భవనం సైతం రష్యా దాడిలో చాలా వరకు దెబ్బతింది. కీవ్, ఖార్కివ్‌లోని ఆసుపత్రుల్లో పరిస్థితులు దయనీయంగా మారాయి. బాంబుల భయంతో అనేక ఆసుపత్రులను ఖాళీ చేయించారు. బంకర్లు, భూగర్భ రైల్వే స్టేషన్‌లలో చికిత్స అందిస్తున్నారు. రోగులు, యుద్ధంలో గాయపడిన వారికి అక్కడే చికిత్స అందిస్తున్నారు. అనేక మంది ప్రజలు ఆయా ప్రాంతాలను ఖాళీ చేసి పొరుగు దేశాలకు వెళ్లి పోగా, ఉన్నవారికి, వెళ్లలేని వారికి ఈ ఆసుపత్రులే దిక్కుగా మారాయి.
వలస వెళ్తున్న ఉక్రెయిన్ పౌరులు ధ్వంసమైన బ్రిడ్జిపై నుంచే తన కుటుంబంతో పారిపోతున్న ఓ మహిళ వలసదారులతో కిక్కిరిసిపోయిన రైళ్లు Russia Ukraine war consequences
ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆ దేశం నుంచి సుమారు పది లక్షల మంది వలస వెళ్లినట్లు అంచనా. ఈ సంఖ్య మరింత పెరగనుంది. వేలాది ప్రాణాలు పోతున్నా, భవనాలు దెబ్బతింటున్నా, ఆర్థికంగా నష్టం జరుగుతున్నా రష్యా తగ్గేదే లేదు అంటోంది. వారం రోజులు గడిచినా సై అంటే సై అనేలా ఇరుదేశాలు పోరాడుతున్నాయి. మరింత మంది రష్యా సైనికులు ఉక్రెయిన్‌లోకి వస్తూనే ఉన్నారు.
రాకెట్ దాడుల్లో ధ్వంసమైన ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ భవనం. పోలాండ్లోని శరణార్థుల శిబిరం వద్ద ఉక్రెయిన్ పౌరులు రష్యా దాడిలో ధ్వంసమైన కీవ్‌లోని జిమ్ చర్చల పేరుతో శాంతి దిశగా కదులుతున్నట్లు అడుగులు వేస్తున్నా రణం మాత్రం ఆగడం లేదు. వారం రోజుల యుద్ధానికే ఉక్రెయిన్‌కు జరిగిన నష్టం ఇంత భారీ స్థాయిలో ఉంటే, ఇది ఇలాగే కొనసాగితే ఉక్రెయిన్ ఇక ఎప్పటికి కోలుకుంటుందో అని యావత్ ప్రపంచం ఆందోళన చెందుతోంది.
రష్యా దాడుల్లో దెబ్బతిన్న ఇళ్లు ఉక్రెయిన్ నుంచి రైలులో వలస వెళ్తున్న ప్రజలు కీవ్‌లోని బాంబ్ షెల్టర్‌లో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ ఇదీ చదవండి:'రష్యా జవాన్ల తల్లుల్లారా.. కీవ్‌కు వచ్చి మీ బిడ్డల్ని విడిపించుకుని వెళ్లండి'