తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆ విద్యార్థులకు ఊరట.. సుమీ నుంచి తరలింపు ప్రారంభం

Indian students in Sumy: ఉక్రెయిన్​లోని సుమీ నగరంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల తరలింపు ప్రారంభమైంది. వీరంతా బస్సుల్లో సురక్షిత ప్రాంతానికి బయల్దేరారు. పోల్టావా అనే ప్రాంతానికి వెళ్తున్నట్లు విద్యార్థులు తెలిపారు.

Indian students in Sumy
Indian students in Sumy

By

Published : Mar 8, 2022, 4:29 PM IST

Indian students in Sumy: ఉక్రెయిన్​లోని సుమీ నగరంలో చిక్కుకుపోయిన భారత విద్యార్థులకు ఊరట లభించింది. ఆ విద్యార్థుల తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. వీరందరూ సుమీ నుంచి బస్సులలో బయల్దేరారు. ఈ విషయాన్ని విద్యార్థులను సమన్వయం చేస్తున్న అన్షద్ అలీ అనే వ్యక్తి వెల్లడించారు.

Indians evacuation Ukraine

కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సుమీలో చిక్కుకుపోయిన విద్యార్థులు పోల్టావాకు వెళ్తున్నట్లు వెల్లడించారు. కంట్రోల్ రూమ్​ నుంచి సోమవారం రాత్రి అందిన సమాచారం ప్రకారం 694 మంది విద్యార్థులు సుమీలో ఉన్నట్లు తెలిపారు. వీరంతా బస్సుల్లో బయలుదేరారని చెప్పారు.

Russia Ukraine War

పౌరుల తరలింపు అంశానికి భారత్ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఈ విషయంపైనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. సోమవారం ఉక్రెయిన్, రష్యా దేశాధినేతలతో మాట్లాడారు. భారతీయుల తరలింపునకు సహకరించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.

ఇప్పటివరకు భారత్ 17,100 మంది పౌరులను స్వదేశానికి తీసుకొచ్చింది.

ఇదీ చదవండి:ఉక్రెయిన్​లో బాంబుల మోత.. రష్యా దాడుల్లో 10 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details