తెలంగాణ

telangana

ETV Bharat / international

యూరోపియన్​ పార్లమెంట్​లో జెలెన్​స్కీకి స్టాండింగ్​ ఒవేషన్​

Russia Ukraine War: ఐరోపాలో సభ్య దేశంగా ఉండటానికి రష్యాతో పోరాడుతున్నట్లు ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీ పేర్కొన్నారు. యుద్ధం జరుగుతున్న సమయంలో యూరోపియన్​ పార్లమెంట్​లో వర్చువల్​గా మాట్లాడిన జెలెన్​స్కీ.. తమ సత్తా ఏంటన్నది నిరూపించుకున్నట్లు చెప్పారు.

Volodymyr Zelenskyy
Volodymyr Zelenskyy

By

Published : Mar 1, 2022, 7:23 PM IST

Russia Ukraine War: రష్యాతో యుద్ధం జరుగుతున్న వేళ.. యూరోపియన్​ పార్లమెంట్​లో వర్చువల్​గా మాట్లాడారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీ. ఐరోపాలో సభ్య దేశంగా ఉండటానికి ఉక్రెయిన్​ పోరాడుతోందన్నారు.

"నేడు మా సత్తా ఏంటన్నది నిరూపించుకున్నట్లు నమ్ముతున్నాను. మేము మీ లాంటివారిమేనని.. మా స్వేచ్ఛ, మాతృభూమి కోసమే కాకుండా ఐరోపా సమాఖ్యలో సమాన సభ్యదేశంగా ఉండేందుకు ఉక్రెయిన్ పోరాడుతోంది" అని యూరోపియన్​ పార్లమెంట్​లో పేర్కొన్నారు జెలెన్​స్కీ.

ఉక్రెయిన్​ అధ్యక్షుడికి అరుదైన గౌరవం

యూరోపియన్​ పార్లమెంట్​లో జెలెన్​స్కీకి అరుదైన గౌరవం లభించింది. ఈయూ పార్లమెంట్​లో జెలెన్​స్కీ.. ఉక్రెయిన్​లో ప్రస్తుత పరిస్థితులపై మట్లాడిన తర్వాత సభ్యులంతా నిలిబడి చప్పట్లు కొట్టారు(స్టాండింగ్​ ఒవేషన్​).

నిలబడి చప్పట్లు కొడుతున్న ఈయూ పార్లమెంట్​ సభ్యులు
జెలెన్​స్కీని అభినందిస్తున్న ఈయూ పార్లమెంట్ సభ్యులు

"మా మాతృభూమి, స్వేచ్ఛ కోసం పోరాడుతున్నాం. మేము ఉక్రెయినీయన్లం. శక్తుమంతులం. మమ్మల్ని ఎవరూ విడదీయలేరు" అని జెలెన్​స్కీ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత సభ్యులంతా లేచి ఆయన్ని చప్పట్లతో అభినందించారు.

ఇదీ చూడండి:'కీవ్'​ లక్ష్యంగా రష్యా దూకుడు.. 65 కి.మీ. పొడవున మోహరింపులు

ABOUT THE AUTHOR

...view details