తెలంగాణ

telangana

ETV Bharat / international

Russia Ukraine War: పుతిన్‌ ప్రియురాలికి ఆ దేశంలో కష్టాలు!

Russia Ukraine War: ఉక్రెయిన్​పై పోరులో ప్రపంచ దేశాల ఆంక్షలను ఏమాత్రం లెక్కచేయడం లేదు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఈ నేపథ్యంలోనే ఆయనను మానసికంగా దెబ్బకొట్టడానికి పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి! అందులో భాగంగానే ప్రస్తుతం స్విట్జర్లాండ్​లో ఉంటోన్న పుతిన్ ప్రేయసి అలీనాను ఆ దేశం నుంచి బహిష్కరించాలంటూ పలువురు పిటిషన్​లు దాఖలు చేశారు.

Russia Ukraine War
putin girlfriend alina kabaeva

By

Published : Mar 22, 2022, 5:37 AM IST

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు చేస్తోంది. ప్రపంచ దేశాలు అనేక ఆంక్షలు విధిస్తున్నప్పటికీ పుతిన్‌ సర్కారు మాత్రం వెనక్కి తగ్గడంలేదు. ఈ నేపథ్యంలో పుతిన్‌ను మానసికంగా బలహీనపరిచేందుకు కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. పుతిన్‌ ప్రియురాలుగా భావిస్తున్న ప్రేయసి అలీనా కబయేవా (38) ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో సెక్యూరిటీ మధ్య జీవిస్తున్నట్లు సమాచారం. దీంతో స్విట్జర్లాండ్‌ నుంచి ఆమెను బహిష్కరించాలంటూ అంతర్జాతీయంగా పనిచేసే ఛేంజ్‌.ఆర్గ్‌ (change.org)లో మూడు దేశాలకు చెందిన కొందరు పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందులో రష్యా కూడా ఉండటం విశేషం. రష్యాతో పాటు ఉక్రెయిన్‌, బెలారస్‌కు చెందిన వారు ఉన్నారు. ఈ పిటిషన్‌ను సమర్థిస్తూ ఇప్పటి వరకు 50వేల మంది సంతకాలు చేశారు.

అలీనా కబయేవా

జిమ్నాస్ట్‌, ఒలిపింక్స్‌ గోల్డ్‌మెడలిస్ట్‌ అయిన అలీనా కబయేవా తన సంతానంతో ఓ లగ్జరీ విల్లాలో ఉంటోందని సమాచారం. వారిని సురక్షితంగా ఉంచేందుకు రష్యా అధ్యక్షుడే వారిని అక్కడికి పంపించినట్లు తెలుస్తోంది. అయితే పుతిన్‌ మాత్రం అలీనాను తన ప్రేయసిగా అధికారికంగా ఎప్పుడూ ప్రకటించలేదు. పుతిన్‌కు చెందిన యునైటెడ్ రష్యా పార్టీకి ప్రాతినిధ్యం వహించిన అలీనా.. ఆరేళ్లపాటు పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు. ప్రస్తుతం నేషనల్ మీడియా గ్రూప్‌ డైరెక్టర్ల బోర్డు చైర్‌పర్సన్‌గా గత ఏడేళ్లుగా ఆమె పనిచేస్తున్నారు.

ఇదీ చూడండి:యుద్ధం ఎలా ముగిద్దాం?.. రాజీమార్గాలపై పుతిన్‌ మల్లగుల్లాలు!

ABOUT THE AUTHOR

...view details