russia ukraine war: రష్యా దండయాత్ర.. ఉక్రెయిన్‌తో ముగియదని, ప్రపంచంలో ఇతర దేశాలపై కూడా ప్రభావం చూపుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను మృగంతో పోల్చిన జెలెన్‌స్కీ.. ఆయన ఎప్పటికీ సంతృప్తి చెందరని వ్యాఖ్యానించారు. తినేకొద్దీ ఆ మృగం ఇంకా కావాలంటూ మిగిలిన దేశాలపైనా దాడికి దిగుతుందని హెచ్చరించారు. ఈ యుద్ధాన్ని ఆపే సామర్థ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఉన్నట్టు పేర్కొన్నారు.
'ఈ యుద్ధాన్ని ఆపే సామర్థ్యం జో బైడెన్‌కే ఉంది'
russia ukraine war: రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై విమర్శలు గుప్పించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. పుతిన్‌ను మృగంతో పోల్చిన ఆయన.. తినేకొద్దీ ఆ మృగం ఇంకా కావాలంటూ మిగిలిన దేశాలపైనా కూడా దాడికి దిగుతుందని హెచ్చరించారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే సామర్థ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఉందని అభిప్రాయపడ్డారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ
ఉక్రెయిన్‌పై నో ఫ్లై జోన్ విధించాలి..
రష్యా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, క్షిపణులు తమపై దాడి చేస్తున్నాయని.. అందుకే ఉక్రెయిన్‌పై నో ఫ్లై జోన్ విధించాలని జెలెన్‌స్కీ మరోసారి విజ్ఞప్తి చేశారు. జెలెన్‌స్కీ చేసిన నో ఫ్లై జోన్ విజ్ఞప్తిని ఇటీవల నాటో దేశాలు తిరస్కరించిన వేళ ఆయన మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇదీ చదవండి:ఆయిల్ కొనుగోళ్లు బంద్.. అత్యధిక ఆంక్షలు రష్యాపైనే