Russia Ukraine War: ఉక్రెయిన్పై గత పది రోజులుగా జరుపుతున్న భీకర దాడులకు తాత్కాలిక విరామాన్ని ప్రకటించింది రష్యా. ఆ దేశంలోని మారియుపోల్, వోల్నవోఖ్ నగరాల్లో మానవతా కారిడార్ ఏర్పాటు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఈ రెండు ప్రాంతాల్లో కాల్పుల విరమణను పాటించనున్నట్లు స్పష్టం చేసింది.
మాస్కో కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10 గంటల నుంచి తమ దళాలు కాల్పులను నిలిపి వేస్తాయని రష్యా వెల్లడించింది.