Russia Ukraine war: ఉక్రెయిన్‌లోని పౌరులను తరలించే మానవతా కారిడార్ల ఏర్పాటు కోసం బుధవారం ఉదయం తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించింది రష్యా. కీవ్‌తో పాటు పలు కీలక నగరాల్లో మానవతా కారిడార్ల ఏర్పాటులో భాగంగా కాల్పులకు విరామం ప్రకటించినట్లు స్పుత్నిక్ న్యూస్ తెలిపింది.
విదేశీయులతో పాటు ఉక్రెయిన్ పౌరులను తరలించేందుకు మానవతా కారిడార్లకు విఘాతం కలుగుతోందని ఇరు దేశాలు పరస్పర ఆరోపణలు చేసుకున్న క్రమంలో.. ఈ ప్రకటన వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. చెర్నిహివ్, సుమీ, ఖర్కివ్, మేరియుపొల్, జపోరిజియా నగరాల్లో బుధవారం కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు మీడియా తెలిపింది.
"పౌరులను తరలించేందుకు రష్యా మరోమారు అవకాశం కల్పించింది. ఉక్రెయిన్ తక్షణమే స్పందించాలి. నిర్దిష్ట మార్గాల్లో 2022, మార్చి 9న ఉదయం 3 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్రతిపాదనకు రాతపూర్వక ఆమోదంతో పాటు భద్రతకు భరోసా కల్పించాలని ప్రకటనలో పేర్కొంది."
- మైకేల్ మిజింత్సేవ్, మానవతా కారిడార్ హెడ్
సుమీ నగరంలో పౌరుల తరలింపు మంగళవారమే ప్రారంభమైంది. అలాగే.. కీవ్ నగరం వెలుపలి ప్రజలను సైతం తరలిస్తున్నారు.
సుమీ నుంచి భారత విద్యార్థుల తరలింపు..
భీకర దాడులకు నెలవైన ఉక్రెయిన్‌లోని సుమీ నగరం నుంచి భారత విద్యార్థులు బయటపడ్డారు. ఆపరేషన్ గంగలో భాగంగా వారిని భారత్‌కు తీసుకొచ్చేందుకు విమానాలు సిద్ధమవుతున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. బస్సుల్లో 175 కిలోమీటర్ల దూరంలోని పోల్టావాకు తరలించినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి ఆరిందమ్ బాగ్చీ తెలిపారు. 'సుమీ నుంచి భారతీయ విద్యార్థులందరినీ తరలించటం సంతోషంగా ఉంది. వారంతా పోల్టావాకు వెళ్తున్నారు. అక్కడి నుంచి ట్రైన్ ద్వారా పశ్చిమ ఉక్రెయిన్‌కు చేరుకుంటారు. ఆపరేషన్ గంగలో భాగంగా నడిచే విమానాలు వారిని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి' అని ట్వీట్ చేశారు. బస్సుల సమీపంలో విద్యార్థులు ఉన్న వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు బాగ్చీ.
మరోవైపు.. సుమీ నగరంలోని పౌరులను తరలించేందుకు రష్యన్ ఫెడరేషన్ సేనలు కల్పించిన భద్రతను కొనియాడింది భారత్‌లోని రష్యా రాయబార కార్యాలయం. మొత్తం 723 మందిని సుమీ నుంచి పశ్చిమ ఉక్రెయిన్‌కు తరలించగా అందులో 576 మంది భారతీయులు, 115 మంది చైనా, 20 మంది జోర్డాన్, 12 మంది ట్యునీసియా దేశస్థులు ఉన్నట్లు పేర్కొంది.
రష్యాలో మెక్‌డొనాల్డ్స్ సేవలు బంద్..