Russia Ukraine Crisis: తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలకు స్వతంత్రత కల్పిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. ఇకనుంచి డొనెట్స్క్, లుహాన్స్క్ స్వతంత్ర రాష్ట్రాలుగా గుర్తిస్తామని అన్నారు. ఈ రాష్ట్రాలకు రష్యా నుంచి మిలిటరీ సహకారం ఉంటుందని తెలిపారు. ఈ మేరకు రష్యా జాతినుద్దేశించి పుతిన్ ప్రసంగించారు.
ఉక్రెయిన్‌ను తోలుబొమ్మ చేసి..
ఉక్రెయిన్‌ను ఇతర శక్తులు తోలుబొమ్మ చేసి ఆడిస్తున్నాయని పరోక్షంగా అమెరికాపై నిప్పులు చెరిగారు పుతిన్. ఇతరశక్తుల ద్వారా మమ్మల్ని నియంత్రించాలనుకుంటున్నారని మండిపడ్డారు.
ఉక్రెయిన్‌ను బయటి శక్తులు నియంత్రిస్తున్నాయి. అమెరికా రాయబార కార్యాలయం కీవ్‌లో కోట్లు కుమ్మరిస్తోంది. ఉక్రెయిన్ పాఠశాలల్లో రష్యన్ భాష తొలగించారు. ఉక్రెయిన్.. రష్యాను బ్లాక్‌మెయిల్ చేసేందుకు యత్నిస్తోంది. ఉక్రెయిన్.. రష్యా వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది. రష్యాకు కలుగుతున్న ముప్పుపై స్పందించకుండా ఉండలేం. గతేడాది ఉక్రెయిన్‌లో 20,000 మంది సైనికులు మాత్రమే ఉన్నారు.
-- వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు