తెలంగాణ

telangana

ETV Bharat / international

ఐరాస భద్రతా మండలి నుంచి రష్యా ఔట్? - russia ukraine latest news

evicting Russia from UNSC: రష్యాకు ఉన్న ఐరాస భద్రతా మండలి శాశ్వత సభ్యత్వాన్ని తొలగించాలని బ్రిటన్ ప్రతిపాదించింది. రష్యాను భద్రతా మండలి నుంచి తొలగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. మరోవైపు, రష్యా అణు బెదిరింపుల నేపథ్యంలో నాటో కీలక వ్యాఖ్యలు చేసింది.

UK RUSSIA UNSC
UK RUSSIA UNSC

By

Published : Mar 1, 2022, 7:38 PM IST

evicting Russia from UNSC: అంతర్జాతీయ ఆంక్షలకు తలొగ్గకుండా దురాక్రమణను కొనసాగిస్తున్న రష్యాపై మరింత కఠినంగా వ్యవహరించాలని బ్రిటన్ భావిస్తోంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని శాశ్వత దేశాల జాబితా నుంచి రష్యాను తొలగించాలని అనూహ్య ప్రతిపాదన చేసింది. ఐదు శాశ్వత సభ్య దేశాల నుంచి రష్యాను తొలగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. రష్యాకు వ్యతిరేకంగా చేపట్టే చర్యల్లో ఇదీ భాగమని చెప్పారు.

Russia Ukraine conflict:

ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి.

NATO on Putin Nuclear threat

మరోవైపు, అణ్వాయుధాలతో ప్రపంచాన్ని పుతిన్ హెచ్చరిస్తున్న నేపథ్యంలో నాటో కీలక ప్రకటన చేసింది. సభ్య దేశాల అణ్వాయుధాల అప్రమత్త స్థాయిని మార్చాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. సభ్య దేశాలను రక్షించేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్​బర్గ్ స్పష్టం చేశారు. అయితే, ప్రస్తుతానికి నాటో న్యూక్లియర్ దళాల అప్రమత్తత స్థాయిని పెంచాల్సిన అవసరమేదీ లేదని చెప్పారు.

అణు యుద్ధాలకు వ్యతిరేకంగా రష్యా అనేక ఒప్పందాలపై సంతకం చేసిందని స్టోల్టెన్​బర్గ్ గుర్తు చేశారు. ఈ యుద్ధాలను గెలవలేమని రష్యా స్వయంగా అంగీకరించినట్లు తెలిపారు.

మరిన్ని కఠిన ఆంక్షలు!

కాగా.. ఉక్రెయిన్​లో రక్తపాతానికి ముగింపు పలకాలని రష్యాను జర్మనీ ఛాన్స్​లర్ ఓలాఫ్ షోల్జ్ డిమాండ్ చేశారు. ఉక్రెయిన్ నుంచి సైన్యాన్ని వెంటనే వెనక్కి పిలవాలని అన్నారు. లేదంటే రష్యా దూకుడుకు వ్యతిరేకంగా మరింత కఠినమైన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:'కీవ్'​ లక్ష్యంగా రష్యా దూకుడు.. 65 కి.మీ. పొడవున మోహరింపులు

ABOUT THE AUTHOR

...view details