Indian student in Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా సేనలు వారం రోజుల నుంచి.. క్షిపణులు, బాంబులతో భీకర దాడులకు పాల్పడుతున్నాయి. ఇప్పటికే ఈ దాడుల్లో ఓ భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోగా.. తాజాగా ఆ దేశ రాజధాని కీవ్‌లో జరిగిన ఘర్షణల్లో మరో భారత విద్యార్థికి బుల్లెట్ తగిలింది. తీవ్ర గాయాలైన విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు.
ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్.. పోలండ్‌లోని విమానాశ్రయంలో మాట్లాడుతూ వెల్లడించారు.
"కీవ్‌లో ఓ విద్యార్థికి తూటా తగిలినట్లు తెలిసింది. వెంటనే నగరంలోని ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే కీవ్‌ను వదిలి సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. యుద్ధ సమయంలో తూటాలకు ఏ ప్రాంతం, ఏ దేశం అనేవి కనిపించవు."