విష ప్రయోగానికి గురైనట్లు అనుమానిస్తున్న రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నావల్నీని మెరుగైన చికిత్స కోసం జర్మనీకి తరలించేందుకు సైబిరియా ఆస్పత్రి వైద్యులు అనుమతించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
నావల్నీని తరలించేందుకు.. జర్మనీ నిపుణుల బృందం, వైద్య పరికరాలతో కూడిన ప్రత్యేక విమానం శుక్రవారం ఉదయమే ఓమ్స్క్ విమానాశ్రయానికి చేరుకుంది. అయితే.. నావల్నీ పరిస్థితి అస్థిరంగా ఉండటం వల్ల సైబీరియా ఆస్పత్రి వర్గాలలు అందుకు నిరాకరించాయి.
అనంతరం జర్మనీ వైద్యులు నావల్నీని పరీక్షించి.. ప్రత్యేకమైన విమానంలో తరలించేందుకు ఎలాంటి అభ్యంతరం ఉండదని తేల్చారని రష్యన్ డాక్టర్లు వెల్లడించారు.