అమెరికాలో తమ దౌత్యవేత్తల బహిష్కరణపై స్పందించిన రష్యా.. 10 మంది అగ్రరాజ్య దౌత్యాధికారులను బహిష్కరించింది. వీరితో పాటు.. మరో ఎనిమిది మంది అమెరికా అధికారులపై ఆంక్షలు విధించనున్నట్లు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రో ప్రకటించారు. అంతేగాక రష్యా రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. తమ దేశంలో అమెరికా వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీసేందుకు అవకాశాలున్నప్పటికీ.. వెంటనే అమలు చేయబోమని లావ్రో చెప్పారు.
'పోలింగ్ డేటా లీక్..'
2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని అమెరికా వాదిస్తోంది. ట్రంప్ ప్రచారానికి సంబంధించిన డేటాను రష్యా అక్రమంగా పొందిందని తెలిపింది. రష్యా-2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి మధ్య ఉన్న సంబంధాలపై దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. రష్యా, ఉక్రేనియా రాజకీయ సలహాదారు కాన్స్టాంటిన్ కిలిమ్నిక్తో అమెరికా ఎన్నికల ప్రచార ఛైర్మన్ పాల్ మనాఫోర్ట్ పోలింగ్ డేటాను ఎందుకు పంచుకున్నారని యూఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ ప్రశ్నించింది. కిలిమ్నిక్కు రష్యా ఇంటెలిజెన్స్‌తో సంబంధాలున్నాయని అమెరికా చాలాకాలంగా ఆరోపిస్తోంది.
పాక్ పౌరులపై అగ్రరాజ్యం ఆంక్షలు..
2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని.. మోసపూరిత పత్రాల ద్వారా ఆంక్షలను తప్పించుకోవడానికి చూసిందని అమెరికా ఆరోపించింది. ఈ క్రమంలో రష్యన్ సంస్థలకు సహకరించిన ఆరుగురు పాకిస్థానీ పౌరులపై ఆంక్షలు విధించింది. వారికి సంబంధించిన నాలుగు కంపెనీలపైనా చర్యలు తీసుకుంది. అమెరికా ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు ప్రయత్నించే వారికి వీరు సాయం చేశారని మండిపడింది.
ఖండించిన రష్యా..