తెలంగాణ

telangana

ETV Bharat / international

రష్యాలో మళ్లీ రికార్డు స్థాయి కరోనా మరణాలు - రష్యాలో కొవిడ్ మరణాలు

రష్యాలో కరోనా మహమ్మారి(Russia Covid Cases) మరోసారి కోరలు చాస్తోంది. మరణాలు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా 890 మరణాలు సంభవించాయి.

Russia
రష్యా

By

Published : Oct 4, 2021, 5:30 AM IST

రష్యాలో మరోసారి కొవిడ్-19 మహమ్మారి(Russia Covid Cases) విజృంభిస్తోంది. గతవారం రోజుల్లో దాదాపు ఐదు సార్లు కరోనా మరణాల సంఖ్య అధికంగా నమోదవుతోంది. ఆదివారం ఒక్కరోజే 890 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం 887 మంది బలయ్యారు.

మరోవైపు కరోనా కేసుల సంఖ్యా పెరుగుతోంది. కానీ లాక్​డౌన్​పై ఆలోచన లేదని అధికారులు తెలిపారు. కరోనా నిబంధనలు ఉన్నా.. ప్రజలు సరిగా పాటించటంలేదన్నారు.

ప్రపంచంలోనే తొలిసారిగా కొవిడ్ వ్యాక్సిన్​ స్పుత్నిక్-వీను తయారుచేసింది. కానీ దేశ జనాభాలో కేవలం 32.5శాతం ప్రజలే టీకా తీసుకున్నారు. 28శాతం ప్రజలకు మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తయింది. దేశంలో కరోనా యాంటీబాడీ పరీక్షలు అధికంగా నమోదవుతున్నాయని.. అందువల్ల వ్యాక్సినేషన్ తగ్గుతోందని కొతమంది విశ్లేషకులు వివరించారు. అంతకుముందు క్రమ్లిన్​లో చాలామంది అధికారులు కొవిడ్​ బారిన పడటం వల్ల ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​ ఐసోలేషన్​లోకి వెళ్లారు. గతవారమే ఐసోలేషన్​ నుంచి బయటకు వచ్చిన పుతిన్​.. టర్కీ దేశాధినేతతో భేటీ అయ్యారు.

రష్యాలో(Russia Covid Cases) కరోనా సంభవించినప్పటి నుంచి 2,10,000 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం 7.5 మిలిన్​ల మందికి వైరస్ సోకింది.

ఇదీ చదవండి:Afghan news: మసీదులో బాంబు దాడి.. ఐదుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details