రష్యా టీకా స్పుత్నిక్-వీ తయారీకి సంబంధించిన సాంకేతికతను పంచుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ప్రకటించారు. సాంకేతిక బదిలీతో పాటు టీకాల తయారీని విదేశాలకు విస్తరించేందుకు సంసిద్ధంగా ఉన్న ఏకైక దేశం రష్యా ఒక్కటేనని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ మీడియా సంస్థల.. ప్రతినిధులతో వర్చువల్‌గా సమావేశమైన పుతిన్ స్పుత్నిక్ టీకాల సామర్థ్యంపై వస్తున్న విమర్శలను కొట్టిపారేశారు.
66 దేశాలకు..
ఇప్పటివరకు 66 దేశాలకు స్పుత్నిక్ టీకాలను విక్రయిస్తున్నట్లు తెలిపిన ఆయన.. టీకా సామర్థ్యంపై వస్తున్న ఆరోపణలు కేవలం వాణిజ్య ప్రయోజనాల కోసం చేస్తున్నవిగా చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ నిపుణులు సైతం స్పుత్నిక్ టీకా 97.6 శాతం సమర్థతతో పనిచేస్తున్నట్లు చెప్పారని పుతిన్ గుర్తుచేశారు.
మరోవైపు భారత్‌లో స్పుత్నిక్ టీకాల తయారీకి సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ముందుకు రాగా.. ఇందుకు కేంద్రం అనుమతించింది. అటు.. పనేసియా బయోటెక్‌తో కలిసి రష్యన్ సావరిన్ వెల్త్ ఫండ్ భారత్ లోనే టీకాలను తయారు చేస్తోంది.
అమెరికా అధ్యక్షునితో చర్చలు..