తెలంగాణ

telangana

ETV Bharat / international

రోదసిలోకి హ్యూమనాయిడ్​ రోబో - ఫెడోర్​

రష్యా తొలిసారిగా రోబోను అంతరిక్షంలోకి పంపనుంది. భూకక్ష్యలో తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్​ఎస్​)లో వ్యోమగాములకు తోడుగా ఈ రోబో పయనమవుతోంది. ఫెడోర్​ గా పిలిచే ఈ మరమనిషి.. వ్యోమగాములకు సాయం చెయ్యడానికి శిక్షణ పొందుతుంది.

రోదసిలోకి హ్యూమనాయిడ్​ రోబో

By

Published : Aug 23, 2019, 9:38 PM IST

Updated : Sep 28, 2019, 1:02 AM IST

భూ కక్ష్యలో తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్​ఎస్​)లో వ్యోమగాములకు తోడుగా ఒక హ్యూమనాయిడ్​ రోబో జత చేరనుంది. మానవుడి పరిమాణంలో ఉన్న ఒక యంత్రుడిని రష్యా గురువారం సాయజ్​ ఎంఎస్​-14 వ్యోమనౌక ద్వారా రోదసిలోకి పంపింది. అది శనివారం ఐఎస్​ఎస్​ను చేరుతుంది. అక్కడే 10 రోజుల పాటు గడిపి, వ్యోమగాములకు సాయం చేయడంపై శిక్షణ పొందుతుంది. రష్యా ఇలా రోబోను పంపడం ఇదే తొలిసారి. అత్యవసర సహాయ వ్యవస్థను పరీక్షిస్తున్న నేపథ్యంలో ఈ సారి సోయజ్​ వ్యోమనౌకలో మానవులను పంపలేదు.

రోబో ప్రత్యేకతలు

పేరు ఫెడోర్​...పొడవు 1.8 మీటర్లు..బరువు 160 కిలోలు..ఇన్​స్టాగ్రామ్​, ట్విట్టర్​ ఖాతాలున్నాయి. నీళ్ల సీసా మూత తెరవడం వంటివి నేర్చుకుంది. అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేని వాతావరణంలో ఈ నైపుణ్యాలను పరీక్షించనుంది.

లెట్స్​గో

ప్రత్యేకంగా రూపొందించిన పైలట్​ సీట్​లో 'ఫెడోర్​'ను కూర్చోబెట్టారు. దాని చేతిలో రష్యా జెండాను ఉంచారు. ప్రయోగ సమయంలో ఈ రోబో...'లెట్స్​ గో..లెట్స్​ గో' అని అరవడం వినిపించింది. అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి మానవుడు యూరి గగారిన్​ అప్పట్లో ఇవే వ్యాఖ్యలు చేశారు.

అప్పట్లో అమెరికా

2011లో అమెరికా తొలిసారిగా రోబోనాట్​-2 అనే హ్యూమనాయిడ్​ రోబోను రోదసిలోకి పంపింది. కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తి దాన్ని గత ఏడాది తిరిగి భూమికి తెచ్చారు. 2013లో కిరోబో అనే ఒక చిన్న రోబోను ఐఎస్​ఎస్​కు పంపింది. ఇది జపాన్​ భాషలో సంభాషించగలదు.

నైపుణ్యాలు

మానవ కదలికలను అనుకరిస్తుంది. స్పేస్​వాక్​ వంటివి చేయగలదు. భూమిపై రేడియో ధార్మిక వాతావరణంలో, మందుపాతరల తొలగింపు వంటి చర్యల్లోనూ ఉపయోగపడుతుంది.

శిక్షణ

  • విద్యుత్​ వైర్లను సంధానించడం, తొలగించడం
  • స్క్రూడ్రైవర్​, మంటలను ఆర్పే సాధనం వంటి వాటిని ఉపయోగించడంపై తర్ఫీదు పొందనుంది.

ఇదీ చూడండివెనుజువెలాలో అవాంఛిత గర్భాలు- కారణం ఇదే!

Last Updated : Sep 28, 2019, 1:02 AM IST

ABOUT THE AUTHOR

...view details