రష్యా, అమెరికా మధ్య విభేదాలు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో.. ఫోన్లో మాట్లాడాలనే తమ అధ్యక్షుడు పుతిన్ ప్రతిపాదనను శ్వేతసౌధం తిరస్కరించిందని రష్యా విదేశాంగ శాఖ తెలిపింది. ఇటీవల పుతిన్ ఉద్దేశించి 'కిల్లర్' అని బైడెన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. బైడెన్‌తో పుతిన్ మాట్లాడాలనుకున్నారని పేర్కొంది.
"అమెరికా తప్పు వల్ల రష్యా- అమెరికా సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు వచ్చిన మరో అవకాశం చేజారిపోయింది. దీనికి పూర్తి బాధ్యత అమెరికాదే."
-రష్యా విదేశాంగ శాఖ.
ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌కు నష్టం వాటిల్లే విధంగా రష్యా ప్రయత్నించినట్లు అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ విభాగం ధ్రువీకరించిన నేపథ్యంలో.. జో బైడెన్ ఘాటగా స్పందించారు. ఎన్నికల్లో తనను అణచివేసేందుకు చేసిన ప్రయత్నాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ తగిన మూల్యం చెల్లించకతప్పదన్నారు. వ్లాదిమిర్ పుతిన్ తన ప్రత్యర్థులతో క్రూరంగా ప్రవర్తిస్తాడని, అతనో 'కిల్లర్' అనే భావనను తాను కూడా నమ్ముతున్నట్లు ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి:'పుతిన్, ఖమైనీ ఆదేశాలతోనే అమెరికా ఎన్నికల్లో జోక్యం!'