తెలంగాణ

telangana

ETV Bharat / international

'కీవ్'లోకి రష్యా బలగాలు.. ఉక్రెయిన్​ హస్తగతమైనట్లేనా?

Russia attack Ukraine: ఉక్రెయిన్​ రాజధాని కీవ్​ను రష్యా హస్తగతం చేసుకునేందుకు ముప్పేట దాడి చేస్తోంది. నగరానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే రష్యా బలగాలు ఉన్నట్లు ఉక్రెయిన్​ మిలిటరీ ప్రకటించింది. ఇప్పటికే కీవ్​ నగరంలో బాంబుల మోతలు ప్రారంభమయ్యాయి.

Ukrainian capital
ఉక్రెయిన్​ రాజధాని కీవ్​

By

Published : Feb 25, 2022, 3:13 PM IST

Russia attack Ukraine: ఉక్రెయిన్​పై సైనిక చర్యను ప్రారంభించిన రష్యా ఆ దేశ రాజధానిని హస్తగతం చేసుకునేందుకు వేగంగా దూసుకెళ్తోంది. నగరానికి మూడు వైపుల నుంచి యుద్ధ ట్యాంకులు, బలగాలు దాడులు చేస్తున్నాయి. ఇప్పటికే కీవ్​ నగరంలో బాంబుల మోతలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యాలయానికి సమీపంలో కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయి.

మరోవైపు.. ఉక్రెయిన్​, రష్యా దాడుల నేపథ్యంలో పశ్చిమ దేశాల నేతలు అత్యవసర సమావేశం కానున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టాలని దాడులు చేస్తున్న రష్యాను నిలువరించాలని ఉక్రెయిన్​ అద్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీ కోరారు. ఈ క్రమంలో ఆ దేశ రాజధానిని వీలైనంత తొందరగా స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

5 కిలోమీటర్ల దూరంలో..

ప్రస్తుత పరిస్థితుల్లో ఉక్రెయిన్​ రాజధాని ప్రమాదపుటంచున ఉన్నట్లు స్పష్టమవుతోంది. రష్యాకు చెందిన బలగాలు, చొరబాటుదారులు రాజధానికి ఉత్తరం వైపు కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయని తాజాగా ఉక్రెయిన్​ మిలిటరీ తెలిపింది. అంతకుముందు రెండు ఉక్రెయిన్​ మిలిటరీ వాహనాలను రష్యా సేనలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ఇదే విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి సైతం ఉద్ఘాటించారు. ఉక్రెయిన్ రాజధాని రష్యా అధీనంలోకి వెళ్లవచ్చని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:రాజధానే లక్ష్యం- ఏ క్షణమైనా రష్యా ఆధీనంలోకి ఉక్రెయిన్

ABOUT THE AUTHOR

...view details