తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఉగ్రవాదంపై భారత్​-రష్యా ఉమ్మడి పోరు'

భారత్​-రష్యాల మధ్య పరస్పర సైనిక సహకారంపై 2020లో చర్చలు జరగనున్నాయని సోవియట్​ రాయబారి నికోలాయ్​ కుడాషేవ్​ అన్నారు. పరస్పర సహకారంతో ఉగ్రవాద నిరోధక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

By

Published : Dec 24, 2019, 5:02 AM IST

Updated : Dec 24, 2019, 8:05 AM IST

Russia and India will further develop military dialogue
ఉగ్రవాదంపై భారత్​-రష్యా ఉమ్మడి పోరు

భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని సోవియట్​ రాయబారి నికోలాయ్ కుడాషేవ్​ అన్నారు. 2020లో ఇరుదేశాల మధ్య పరస్పర సైనిక సహకారం, ఉగ్రవాద నిరోధక చర్యలపై నిర్మాణాత్మక చర్చలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

బ్రిక్స్​, ఎస్​సీఓ, ఆర్​ఐసీలు రూపొందించిన నిబంధనల మేరకు భారత్​-రష్యాల మధ్య ఈ సైనిక సహకారం, ఉగ్రవాద నిరోధక చర్యలపై చర్చలు జరుగనున్నాయని నికోలాయ్ తెలిపారు. త్వరలోనే యురేషియా ఎకనామిక్​ యూనియన్​- భారత్​ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరగాలని రష్యా ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రవర్తన నియమాల అనుసారం.. భారత్​, రష్యాలు పరస్పర గౌరవంతో మెలుగుతాయని అన్నారు. ఒకరి దేశీయ అంతర్గత విషయాల్లో మరొకటి జోక్యం చేసుకోదని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:బోయింగ్ ​ నూతన సీఈవోగా డేవిడ్​ కాల్హూన్​

Last Updated : Dec 24, 2019, 8:05 AM IST

ABOUT THE AUTHOR

...view details