తెలంగాణ

telangana

ETV Bharat / international

'మాది జాత్యహంకార కుటుంబం కాదు' - మేఘన్ మార్కెల్

తమ కుటుంబంలో ఏ మాత్రం జాత్యహంకార ధోరణి లేదన్నారు ప్రిన్స్​ విలియం. రాజకుటుంబంపై తన తమ్ముడు ప్రిన్స్​ హ్యారీ, ఆయన భార్య మేఘన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన వేళ దానిపై స్పందించారు విలియం.

Royal family very much not racist, says Prince William
'మాది జాత్యంహకార కుటుంబం కాదు'

By

Published : Mar 11, 2021, 9:54 PM IST

బ్రిటన్​ రాజకుటుంబంలో జాత్యహంకార పోకడలు ముమ్మాటికీ లేవన్నారు ప్రిన్స్ విలియం. ఇటీవల ప్రిన్స్​ హ్యారీ, మేఘన్ మార్కెల్ ఇచ్చిన సంచలన ఇంటర్వ్యూపై తూర్పు లండన్​లోని ఓ పాఠశాలకు హాజరైన సందర్భంగా ఆయన స్పందించారు.

"మాది ఎంతమాత్రం జాత్యహంకార కుటుంబం కాదు. నాటి సంఘటనలను జ్ఞప్తికి తెచ్చుకున్నప్పుడు అభిప్రాయభేదాలు ఉండవచ్చు. అయితే వాటిని తీవ్రంగా పరిగణిస్తాం. ఈ వ్యవహారాన్ని కుటుంబం మధ్యలో పరిష్కరించుకుంటాం. హ్యారీ, మేఘన్, ఆర్చీలను ఎప్పటికీ ప్రేమిస్తాం."

- ప్రిన్స్ విలియం

అయితే తాను ఇంతవరకు హ్యారీని కలవలేదని, త్వరలోనే అతడితో మాట్లాడాలనుకుంటున్నట్లు చెప్పారు విలియం. కొన్నేళ్లుగా తన మనవడు హ్యారీ, అతడి భార్య మేఘన్ ఎదుర్కొన్న సవాళ్ల పట్ల రాణి ఎలిజెబెత్ విచారం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:హ్యారీ-మేఘన్​ వ్యాఖ్యలపై రాజకుటుంబం స్పందన

ABOUT THE AUTHOR

...view details