తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా ముప్పుతో స్వీయ నిర్బంధంలోకి ప్రధాని

కరోనా సోకిందన్న అనుమానం మరో దేశాధినేతను కలవరపెడుతోంది. ముందు జాగ్రత్తగా నిర్బంధంలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు రొమేనియా ప్రధాని.

Romanian PM self-quarantines after possible virus contact
కరోనా ముప్పుతో స్వీయ నిర్బంధంలోకి ప్రధాని

By

Published : Mar 13, 2020, 8:20 PM IST

కరోనా.. ఈ పేరు వింటేనే ప్రతి ఒక్కరికీ వణుకు వస్తుంది. చిన్నా పెద్దా ఈ వైరస్​ బారిన పడకుండా రక్షించుకునేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా రొమేనియా ప్రధాన మంత్రి లుడోవిక్ ఓర్బన్ నేటి నుంచి స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. అక్కడి నుంచే తన విధులు నిర్వర్తిస్తానని చెప్పారు.

అసలు కారణం ఇదే..

సోమవారం లుడోవిక్​ ఓ రాజకీయ సమావేశానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి హాజరైన ఓ సెనేటర్​కు కరోనా సోకినట్లు ఆలస్యంగా తెలిసింది. తనకు కూడా వైరస్​ సోకినట్లు అనుమానించిన ప్రధాని... నిర్బంధంలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. ఓర్బన్​తో పాటు ఆ సమావేశానికి హాజరైన మంత్రులకూ కరోనా పరీక్షలు చేస్తున్నారు.

రొమేనియాలో ఇప్పటివరకు 70 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​ వ్యాప్తి దృష్ట్యా అన్ని విద్యా సంస్థలు, సాంస్కృతిక సంస్థలను మూసివేసింది అక్కడి ప్రభుత్వం. ఇటలీ సహా అనేక దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆంక్షలు విధించింది.

ఇదీ చదవండి:కరోనాపై చైనా విజయం.. కొత్త కేసులు తగ్గుముఖం

ABOUT THE AUTHOR

...view details