ఇరాక్‌లోని సైనిక స్థావరాలపై మరోసారి దాడి జరిగింది. అమెరికా సంకీర్ణ దళాలున్న తాజీ స్థావరం వద్ద కత్యుషా రాకెట్ పేలినట్లు ఇరాక్ మిలటరీ తెలిపింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని పేర్కొంది ఇరాక్. అయితే ఎన్ని రాకెట్లతో దాడి జరిగిందనే విషయాన్ని వెల్లడించలేదు.
అమెరికా దళాలున్న ఇరాక్ స్థావరంపై రాకెట్ దాడి - ఇరాక్‌లోని సైనిక స్థావరాలపై మరోసారి దాడి
అమెరికా దళాలున్న ఇరాక్ స్థావరంపై కత్యుషా రాకెట్‌తో మరోసారి దాడి జరిగిందని ఆ దేశ సైనికాధికారులు తెలిపారు. ఇరాక్-అమెరికా సంకీర్ణ దళాలున్న తాజీ స్థావరం వద్ద జరిగిన ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదన్నారు.

అమెరికా దళాలున్న ఇరాక్ స్థావరంపై రాకెట్ దాడి
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తీవ్రమైనప్పటినుంచి ఇరాక్‌లోని అగ్రరాజ్య స్థావరాలపై పలుమార్లు రాకెట్లతో దాడి జరిగింది. ఇరాన్ అగ్రనేత ఖాసీం సులేమానీ హత్య అనంతరం అమెరికా స్థావరాలే లక్ష్యంగా.. ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఈ దాడి కూడా ఇరాన్ పనేనని అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: ఆ డిమాండ్లకు విలువలేదు: 'ఈటీవీ భారత్'తో జేఎన్‌యూ వీసీ
Last Updated : Jan 15, 2020, 7:38 AM IST