omicron virus news : ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్‌తో తీవ్ర ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) (WHO on omicron variant) హెచ్చరించింది. ఒమిక్రాన్‌లోని మ్యుటేషన్లకు రోగనిరోధకవ్యవస్థను తప్పించుకునే సామర్థ్యం ఉందన్న డబ్ల్యూహెచ్‌వో.. భవిష్యత్తులో కేసులు పెరిగే అవకాశముందని పేర్కొంది. ఫలితంగా తీవ్ర పరిణామాలు తలెత్తే ప్రమాదం ఉందని చెప్పింది. వ్యాక్సినేషన్ వేగవంతం సహా ఆరోగ్య రంగ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని ప్రపంచ దేశాలకు సూచించింది.
ఒమిక్రాన్‌లోని స్పైక్ ప్రొటీన్‌లో 26 నుంచి 32 వరకూ ఉత్పరివర్తనాలు ఉన్నాయన్న డబ్ల్యూహెచ్‌వో.. వాటిలో కొన్నింటికి రోగ నిరోధక వ్యవస్థను తప్పించుకునే సామర్థ్యం, వేగంగా వ్యాపించే లక్షణం (omicron variant symptoms) ఉందని తెలిపింది. ఫలితంగా ప్రపంచదేశాలకు ఒమిక్రాన్ విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఒమిక్రాన్‌కు ఉన్న లక్షణాలతో రాబోయే రోజుల్లో కొవిడ్ కేసుల (omicron variant cases) సంఖ్య పెరిగే అవకాశముందని, అదే జరిగితే తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని అంచనావేసింది.