బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన చట్టసభ్యుడు డేవిడ్ అమెస్.. శుక్రవారం జరిగిన కత్తిదాడిలో మరణించారు. తూర్పు ఇంగ్లాండ్‌లోని ఓ చర్చ్‌లో సొంత నియోజకవర్గం ప్రజలతో అమెస్ సమావేశం కాగా.. ఆయనపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ 25ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి ఎయిర్ అంబులెన్స్‌ను పంపించారు. డెవిడ్కు చికిత్స అందించినా.. శరీరంపై అనేక కత్తిపోట్లు ఉండటం కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు. అయితే అమెస్‌పై దాడి జరిగి రెండు గంటలు దాటినా ఆయనకు ఎవరూ చికిత్స అందివ్వలేదని స్థానిక కౌన్స్లర్ ఒకరు వ్యాఖ్యానించారు.