తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా టీకాపై ప్రకటనలు ఆశాకిరణాలు: గుటేరస్​

కరోనా టీకాలు విజవంతమైనట్లు పలు సంస్థలు చేస్తున్న ప్రకటనలను ఆశా కిరణాలుగా అభివర్ణించారు ఐరాస సెక్రెటరీ జనరల్​ గుటేరస్. అయితే టీకాలను ప్రపంచంలోని ప్రతిఒక్కరికీ చేరేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, ఔషధాలకు సంబంధించి జీ-20 దేశాలు పరస్పర సహకారంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

Recent breakthroughs on COVID-19 vaccines offer ray of hope: UN chief Guterres
కరోనా టీకాపై ప్రకటనలు ఆశాకిరణాలు: గుటేరస్​

By

Published : Nov 21, 2020, 3:23 PM IST

కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక పురోగతి సాధించినట్లు పలు సంస్థలు ప్రకటించడాన్ని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్​ ఆంటోనియో గుటేరస్ స్వాగతించారు. ఈ ప్రకటనలు ఆశాకిరణాలని పేర్కొన్నారు. టీకాలను ప్రపంచ దేశాల్లోని ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే మహమ్మారిని అంతమొందించడం సాధ్యమవుతుందన్నారు.

తాము అభివృద్ది చేసిన టీకాలు 95 శాతం సమర్థంగా పనిచేస్తున్నాయని ఫైజర్​, మోడెర్నా సంస్థలు ఇటీవలే ప్రకటించాయి. 65ఏళ్ల పైబడిన వృద్ధుల్లోనూ టీకా సత్ఫలితాలిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ విషయంపై స్పందించారు గుటేరస్.

కరోనా వ్యాక్సిన్ అభివృద్ది, చికిత్స, ఔషధాల కోసం జీ-20 దేశాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని గుటేరస్ పిలుపునిచ్చారు. 'యాక్సెస్​ టు కొవిడ్​-19 టూల్​(యాక్ట్​)'ను వేదికగా ఉపయోగించుకోవాలని సూచించారు.

మోడెర్నా టీకా ప్రకటన అనంతరం ఈ ఏడాది డిసెంబర్​ చివరి నాటికి 5 కోట్ల వ్యాక్సిన్​ డోసులు సిద్ధమవుతాయనే అంచనాలు నెలకొన్నాయి. 2021 పూర్తయ్యే వరకు మొత్తం 130 కోట్ల డోసులు ఉత్పత్తి అవుతాయని నిపుణులు భావిస్తున్నారు.

కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ప్రపంచ దేశాలు ఇప్పటి వరకు 10 బిలియన్​ డాలర్ల నిధులు మాత్రమే సమకూర్చినట్లు గుటేరస్ తెలిపారు. ఇంకా 28 బిలియన్ డాలర్లు అవసరమని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details