కులుకుల నడుముకి వెనకన తిరుగుతు కళకళలాడే జడా.. ఓ వాలు జడా.. మల్లె పూల జడా.. ఇది జడ గురించి.. దాని అందం గురించి సినీ కవి రసాత్మకంగా రాసిన గీతం. అంతలా మగువ అందాన్ని మరో స్థాయిలో నిలిపే జట్టు కాస్త పొడవుంటేనే చూపు తిప్పుకోలేం. ఇక నడుము మీద నుంచి పాదాల దాక వాలితే అంతే సంగతులు. అలా కురుల మాయాజాలంతో 'రుపంజెల్' యువరాణిలా కుర్రకారు మనసు దోచేస్తోంది అలోనా క్రవ్చెంకో.
ఉక్రెయిన్‌కు చెందిన అలోనాకు ప్రస్తుతం 35 ఏళ్లు. ఆమె తన ఐదో ఏట నుంచే జట్టు కత్తిరించడం మానేసింది. దీంతో అది ఏకంగా ఆరున్నర అడుగుల వద్ద హొయలుబోతోంది.
అలోనా జుట్టు.. ఆమె శరీర ఎత్తు కన్నా పొడుగ్గా ఉంటుంది. ఇక ఆమె కురుల సొగసు చూడటానికే ఏకంగా 70 వేల మంది ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను అనుసరిస్తున్నారు.