బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్-2 దంపతులు శుక్రవారం తమ 73వ పెళ్లిరోజును ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఓ ప్రత్యేకమైన ఫొటోను తమ అభిమానులతో పంచుకున్నారు. ఇందులో రాజ దంపతులు తమ మనవళ్లు తయారు చేసిన గ్రీటింగ్ కార్డును పరిశీలిస్తూ కనిపించారు.
73వ వివాహ వసంతంలోకి రాజ దంపతులు
బ్రిటన్రాణి ఎలిజబెత్-2, యువరాజు ఫిలిప్ల వివాహం జరిగి 73వసంతాలు పూర్తయింది. ఈ వేడుక సందర్భంగా తమ మనవళ్లు తయారు చేసిన గ్రీటింగ్ కార్డును పరిశీలిస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు రాజ దంపతులు.
73వ పెళ్లిరోజును ఘనంగా జరుపుకున్న రాయల్ దంపతులు
ఎలిజబెత్ తన 21వ ఏట 1947లో ఫిలిప్ను వివాహమాడారు. 1952 నుంచి బ్రిటన్ రాణిగా కొనసాగుతున్నారు. ఫిలిప్ మాత్రం ప్రజాజీవితం నుంచి రిటైర్ అయ్యారు. ఇంగ్లాండ్లో కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రస్తుతం దంపతులిద్దరూ ఐసోలేషన్లో ఉన్నారు.