తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రెగ్జిట్ ఒప్పందానికి క్వీన్​ ఎలిజబెత్​-2 ఆమోదముద్ర - నెగ్గిన బ్రిటన్ ప్రధాని బోరిస్ పంతం

బ్రెగ్జిట్​ ఒప్పందానికి బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 ఆమోదం తెలిపారు. ఫలితంగా జనవరి 31న ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు మార్గం సుగమమైంది. వచ్చేవారం యూరోపియన్​ పార్లమెంటు ఈ ఒప్పందానికి మద్దతు తెలపాల్సి ఉంటుంది. ఇదే జరిగితే ఈయూ నుంచి వైదొలిగిన మొదటి దేశంగా బ్రిటన్ నిలిచిపోతుంది.

BREXIT: Queen gives assent for Britain to leave EU
బ్రెగ్జిట్​కు బ్రిటన్​ క్వీన్​ ఎలిజబెత్​-2 ఆమోదం

By

Published : Jan 23, 2020, 11:22 PM IST

Updated : Feb 18, 2020, 4:34 AM IST

క్వీన్ ఎలిజబెత్-2... బ్రెగ్జిట్​కు అధికారికంగా ఆమోద ముద్ర వేశారు. ఫలితంగా జనవరి 31న బ్రిటన్​... ఈయూ నుంచి వైదొలిగేందుకు మార్గం సుగమమైంది. బ్రస్సెల్స్​లో ఈయూకు చెందిన ఇద్దరు అత్యున్నత అధికారులు శుక్రవారం ఈ విభజన ఒప్పందంపై సంతకం చేయనున్నారు.

ఇక మిగిలింది ఈయూ అంగీకారమే!

వచ్చేవారం యూరోపియన్​ పార్లమెంటు ఈ ఒప్పందానికి మద్దతు తెలపాల్సి ఉంది. అదే జరిగితే లండన్​లో ఇది ఓ చారిత్రక ఘట్టంగా మిగిలిపోతుంది. ఎందుకంటే 28 సభ్య దేశాలు కలిగిన ఈయూ నుంచి వైదొలగిన తొలి దేశంగా బ్రిటన్​ నిలుస్తుంది. జాన్సన్​కు తాను పదవి చేపట్టిన కాలంలో ఇదో పెద్ద విజయం అవుతుంది.

పంతం నెగ్గించుకున్న బోరిస్​!

మాజీ ప్రధాని థెరెసా మే... 2018లో బ్రెగ్జిట్​ ఒప్పందంపై చర్చలు జరిపారు. దిగువ సభ ఈ విషయాన్ని మూడుసార్లు తిరస్కరించింది. ఫలితంగా.. థెరెసా రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన బోరిస్​... బ్రెగ్జిట్​ను సాకారం చేసేందుకు చాలా కృషి చేశారు. మెజారిటీ లేకపోవడం వల్ల గతనెలలో ఎన్నికలకు వెళ్లారు. జాన్సన్​ అధిక మెజారిటీతో తిరిగి అధికారాన్ని చేపట్టారు. ఆ తర్వాత ఎంపీలు ఈ ఒప్పందానికి మద్దతు పలికారు. ఐరోపా సమాఖ్య నుంచి తమ దేశ నిష్క్రమణకు ఉద్దేశించిన బ్రిగ్జిట్ ఒప్పందాన్ని నిన్న బ్రిటన్​ పార్లమెంటు ఆమోదించింది.

బ్రెగ్జిట్ తరువాత?

ఈయూ నుంచి బ్రిటన్​ వైదొలిగిన తరువాత ఏం చేయాలనే దానిపై బ్రిటన్​ ప్రధాని బోరిస్​ వచ్చే నెల ప్రారంభంలో ఓ విధాన నిర్ణయం తీసుకునే అవకాశముంది.

ఇదీ చూడండి: ఇకపై ఫోన్​ పే నుంచీ 'ఏటీఎం' సేవలు

Last Updated : Feb 18, 2020, 4:34 AM IST

ABOUT THE AUTHOR

...view details