తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా టీకా తీసుకున్న బ్రిటన్​ రాణి ఎలిజబెత్​ - క్వీన్ ఎలిజబెత్​

బ్రిటన్​ రాణి ఎలిజబెత్, ఆమె భర్త కరోనా టీకా తీసుకున్నారు. కుటుంబ వైద్యుల పర్యవేక్షణలో శనివారం వ్యాక్సిన్​ మొదటి డోసు అందుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ​

queen-elizabeth-receives-vaccine
బ్రిటన్​ రాణికి టీకా

By

Published : Jan 9, 2021, 11:09 PM IST

బ్రిటన్​ రాణి ఎలిజబెత్ ఆమె భర్త ప్రిన్స్​ ఫిలిప్​ కొవిడ్​ టీకా తీసుకున్నారు. ఈ మేరకు అధికారిక వర్గాలు శనివారం వెల్లడించాయి. బకింగ్​హమ్ ప్యాలెస్​లో వైద్యుల పర్యవేక్షణలో దంపతులు వ్యాక్సిన్​ తీసుకున్నట్టు తెలిపాయి.

ఊహాగానాలకు తెరదించేలా తాను వ్యాక్సిన్​ తీసుకున్నట్లు అందరికీ తెలపాలని రాణి ఎలిజబెత్​ చెప్పినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. బ్రిటన్​లో ఇప్పటి వరకు దాదాపు 15 లక్షల మంది కొవిడ్ టీకా మొదటి డోసు తీసుకున్నారు.

ఇదీ చదవండి :'క్యాపిటల్‌'పై దాడికి ముందు ట్రంప్‌ పార్టీ?

ABOUT THE AUTHOR

...view details