Queen's platinum jubilee: ఎలిజబెత్ రాణి-2 బ్రిటిష్ సింహాసనాన్ని అధిరోహించి ఫిబ్రవరి 6వ తేదీతో 70 ఏళ్లు పూర్తికానున్న సందర్భంగా బ్రిటన్ అంతటా ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు జరగనున్నాయి. ఇంత సుదీర్ఘ కాలం బ్రిటన్‌ను పాలించిన తొలి రాజవంశీకురాలు ఆవిడే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జరిగే సంబరాలు జూన్ 2-5 మధ్య నాలుగురోజుల సెలవుదినాలతో ముగుస్తాయి.
95 ఏళ్ల ఎలిజబెత్ రాణి-2 దేశానికి అందించిన సేవలను గౌరవిస్తూ ఈ నాలుగు రోజుల్లో విందు వినోదాలు, ప్లాటినం పుడ్డింగ్ తయారీ పోటీలు జరుగుతాయి. ఈ పోటీల్లో అయిదుగురిని తుది పోటీలకు ఎంపిక చేస్తారు. విజేతను బకింగ్‌హాం ప్యాలెస్ ప్రధాన చెఫ్ మార్క్ ప్లానగన్‌తో పాటు టీవీ వంటల కార్యక్రమ జడ్డీలు మోనికా గాలెట్టి, మేరీ బెర్రీ నిర్ణయిస్తారు. పోటీలో నెగ్గిన వంటకాన్ని ప్రజలకు ప్రదర్శిస్తారు. జూన్‌లో రెండో శనివారం రాణి జన్మదిన వేడుకలో భాగంగా సైనిక కవాతు జరుగుతుంది. బ్రిటిష్ వాయుసేన విమానాల ప్రదర్శనతో ఈ కవాతు ముగుస్తుంది.