తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​ నేత నోట.. సారే జహాసే అచ్ఛా పాట! - ఇండియా

కశ్మీర్ అంశంపై రాద్ధాంతం చేస్తున్న పాకిస్థాన్​కు.. సొంత దేశానికి చెందిన కీలక నేత నుంచే చుక్కెదురైంది. అధికరణ 370 రద్దు పూర్తిగా భారత్ అంతర్గత వ్యవహారమని ముత్తాహిద క్వామీ మూమెంట్ వ్యవస్థాపకుడు అల్తాఫ్ అన్నారు.​

అల్తాఫ్​ హుస్సేన్​

By

Published : Sep 2, 2019, 6:16 AM IST

Updated : Sep 29, 2019, 3:27 AM IST

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక హోదా కల్పించే అధికరణ 370 రద్దును పాకిస్థాన్​కు చెందిన ఓ కీలక నేత సమర్థించారు. కశ్మీర్​ అంశం పూర్తిగా భారత్​ అంతర్గత వ్యవహారమని ఆయన స్పష్టం చేశారు. భారత ప్రభుత్వ నిర్ణయానికి ఆ దేశ ప్రజలంతా సంపూర్ణ మద్దతు ఇచ్చారని 'ముత్తాహిద క్వామీ మూమెంట్' (ఎంక్యూఎం) వ్యవస్థాపకుడు అల్తాఫ్ హుస్సేన్​ అన్నారు.

ప్రస్తుతం అల్తాఫ్​ లండన్​లో ప్రవాస జీవితం గడుపుతున్నారు. భారత్-పాక్​ల మధ్య నెలకొన్న అనిశ్చితిపై లండన్​లోని ఎంక్యూఎం కార్యాలయం వేదికగా వీడియో ప్రసంగం చేశారు. ఈ అంశంలో పాకిస్థాన్ వైఖరిని తప్పుబట్టారాయన. పాక్​ పాలకులు తమ దేశ ప్రజలను వంచిస్తున్నారని ఆరోపించారు. ఎంక్యూఎం విడుదల చేసిన వీడియోలో అల్తాఫ్​ భారత్​కు మద్దతుగా 'సారే జహాసే అచ్ఛా' దేశ భక్తి గీతం అలపించినట్లుగా ఉంది.

ఇదీ చూడండి: కుల్‌భూషణ్‌ జాదవ్​కు నేడు దౌత్యసాయం

Last Updated : Sep 29, 2019, 3:27 AM IST

ABOUT THE AUTHOR

...view details