తెలంగాణ

telangana

ETV Bharat / international

మోదీకి దేశాధ్యక్షులు, ప్రధానుల శుభాకాంక్షలు - ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

ప్రధాని నరేంద్ర మోదీ 70వ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు దేశాధ్యక్షులు, ప్రధానులు.. మోదీకి ట్విట్టర్​ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

Putin wishes PM Modi on his 70th birthday, lauds his contribution to strengthen Indo-Russia ties
ప్రధాని మోదీకి వివిధ దేశాధ్యక్షులు, ప్రధానుల శుభాకాంక్షలు

By

Published : Sep 17, 2020, 4:30 PM IST

ప్రధాని నరేంద్రమోదీ 70వ పుట్టినరోజు సందర్భంగా పలువురు విదేశీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ జాబితాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్​ పుతిన్​, బ్రిటన్ ప్రధాని బోరిస్​ జాన్సన్​, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్,​ నేపాల్​ పీఎం కేపీ శర్మ ఓలీ ఉన్నారు.

ఇరుదేశాల భాగస్వామ్యంలో మోదీయే కీలకం..

రష్యా అధ్యక్షుడి ట్వీట్​

"70వ పడిలోకి అడుగిడుతున్న మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు" అని ట్వీట్​ చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్​ పుతిన్​. భారత్​- రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో మోదీ కృషిని కొనియాడారు. మోదీ నాయకత్వంలో దేశం.. సామాజిక, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక రంగాలలో మరింత విజయవంతంగా ముందుకెళ్లాలని ఆకాంక్షించారు.

బ్రిటన్​ ప్రధాని ఏమన్నారంటే.?

బ్రిటన్​ ప్రధాని ట్వీట్​

'నా మిత్రుడైన ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు. త్వరలోనే నేను మిమ్మల్ని కలవాలని ఆశిస్తున్నాను.' అని మోదీతో కలిసి దిగన ఫొటోను ట్విట్టర్​లో పంచుకున్నారు బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​.

ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం..

నేపాల్​ ప్రధాని ట్వీట్​

నేపాల్​ ప్రధాని కేపీ శర్మ ఒలీ.. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మోదీ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కాంక్షించారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి తాము ఇరువురూ కలిసి పనిచేస్తామని ఆయన ట్విట్టర్​లో పేర్కొన్నారు.

భూటాన్​ పీఎం..

భూటాన్​ ప్రధాని ట్వీట్​

భూటాన్​ ప్రధాన మంత్రి లొటాయ్​ షెరింగ్​.. ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయకత్వంలో భారత్​ మరింత పురోగతివైపు పయనిస్తుందని కొనియాడారు. 'మీ మంచి భవిష్యత్తు కోసం భూటాన్​ ప్రజలు, ప్రభుత్వం.. ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాయి' అని ట్వీట్​ చేశారు షెరింగ్​.

జర్మన్​ ఛాన్స్​లర్​..

జర్మన్​ ఛాన్స్​లర్​ ఏంజెలా మెర్కెల్​.. మోదీకి 70వ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె.. మోదీకి లేఖ రాశారు​.

ఇదీ చదవండి:70వ వసంతంలోకి అడుగుపెట్టిన ప్రధాని మోదీ

ABOUT THE AUTHOR

...view details