తెలంగాణ

telangana

ETV Bharat / international

బైడెన్‌ను అధ్యక్షుడిగా గుర్తించను: పుతిన్‌ - రష్యా అమెరికా బంధాలపై పుతిన్ వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ గెలుపును గుర్తించేందుకు సిద్ధంగా లేనని.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ స్పష్టం చేశారు. బైడెన్‌ను అభినందించకూడదని క్రెమ్లిన్‌ నిర్ణయం తీసుకుందని.. వీటిలో ఎలాంటి ఉద్దేశాలు లేవని పుతిన్‌ వివరణ ఇచ్చారు. అయితే ఎవరి నాయకత్వంలోనైనా అమెరికాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

Putin not Reday to recognize Biden as US President
బైడెన్​ను అధ్యక్షుడిగా గుర్తించన్న పుతిన్

By

Published : Nov 23, 2020, 5:11 AM IST

Updated : Nov 23, 2020, 6:18 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఎట్టకేలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ స్పందించారు. ఎవరి నాయకత్వంలోనైనా అమెరికాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కానీ, అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ గెలుపును మాత్రం గుర్తించేందుకు సిద్ధంగా లేనని పుతిన్‌ స్పష్టంచేశారు. 'అమెరికా ప్రజల నమ్మకాన్ని కలిగిన ఏ నాయకుడితోనైనా మేము కలిసి పనిచేస్తాం. అయితే, ఆ విశ్వాసాన్ని ప్రతిపక్ష పార్టీ గుర్తించిన అభ్యర్థి లేదా చట్టపరమైన మార్గంలో ఫలితాలు నిర్ధరణ అయిన తర్వాతే పొందుతారు' అని రష్యన్‌ అధికారిక మీడియాలో పుతిన్‌ వెల్లడించారు. బైడెన్‌ను అభినందించకూడదని క్రెమ్లిన్‌ నిర్ణయం తీసుకుందని.. వీటిలో ఎలాంటి ఉద్దేశాలు లేవని పుతిన్‌ వివరణ ఇచ్చారు. అయితే, ఈ చర్య అమెరికా-రష్యా సంబంధాలను దెబ్బతీస్తుందా? అన్న ప్రశ్నకు బదులుగా.. 'దెబ్బతినడానికి ఏమీ లేవు, అవి ఇప్పటికే పూర్తిగా క్షీణించిపోయాయి' అని పుతిన్‌ సమాధానమిచ్చారు.

ఆచితూచి వ్యవహరిస్తూ..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ప్రపంచ దేశాధినేతలు బైడెన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కేవలం, రష్యా, చైనా వంటి దేశాలు మాత్రమే ఆచితూచి స్పందించాయి. చివరకు చైనా కూడా బైడెన్ ఎన్నికపై శుభాకాంక్షలు తెలిపింది. కానీ, పుతిన్‌ మాత్రం అమెరికా అధ్యక్షుడిగా బైడెన్‌ను గుర్తించేందుకు సిద్ధంగా లేనని తాజాగా ప్రకటించారు.

ఇదిలాఉంటే, 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకుంటూ.. ట్రంప్‌నకు సాయం చేసారని రష్యాపై అమెరికా ఇంటెలిజెన్స్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి రష్యా కాస్త జాగ్రత్తపడింది. అందుకే బైడెన్‌ ఎన్నికపై ఆచితూచి స్పందిస్తోంది.

ఇదీ చూడండి:'మిషిగన్​లో బైడెన్​ గెలుపునే ఖరారు చేసేయండి'

Last Updated : Nov 23, 2020, 6:18 AM IST

ABOUT THE AUTHOR

...view details