తెలంగాణ

telangana

ETV Bharat / international

Putin warns NATO: 'అలా చేస్తే మాతో యుద్ధానికి దిగినట్టే' - రష్యా ఉక్రెయిన్ లేటెస్ట్ న్యూస్

Putin no-fly Zone warning: ఉక్రెయిన్​ గగనతలాన్ని నో ఫ్లై జోన్​గా ప్రకటిస్తే.. ఆయా దేశాలు తమపై యుద్ధానికి దిగినట్లుగానే భావిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. నో ఫ్లై జోన్ విధిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. మరోవైపు, రష్యాలో నిరసనలను అణచివేసేందుకు మార్షల్ లా విధించే ఆలోచన లేదని చెప్పారు.

Putin warning NATO
Putin warning NATO

By

Published : Mar 5, 2022, 9:21 PM IST

Putin Warns NATO: ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా సహా పలు పశ్చిమ దేశాలు తమపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో.. రష్యాపై ఆంక్షలు విధించడం యుద్ధ ప్రకటనలతో సమానమని వ్యాఖ్యానించారు. రష్యాలో మార్షల్‌ లా అవసరం లేదన్నారు. ఉక్రెయిన్‌పై దాడుల్ని వ్యతిరేకిస్తూ రష్యాలో పౌరుల ఆందోళనల కట్టడికి మార్షల్‌ లా విధించే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు.

అలాగే, ఉక్రెయిన్‌ గగనతలాన్ని ఏ దేశమైనా నో ఫ్లై జోన్‌ విధించినా.. అలా విధించాలని కోరినా యుద్ధంలో భాగమైనట్టేనని పుతిన్‌ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌పై నో ఫ్లై జోన్‌ విధిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. నో ఫ్లై జోన్‌ను విధించే దేశాలు రష్యాతో ఘర్షణకు సిద్ధపడాలన్నారు. "నో ఫ్లై జోన్‌ విధించిన ఏ దేశమైనా మాస్కోతో వివాదంలోకి వచ్చినట్టే భావిస్తాం. ఆ దేశాలు యుద్ధంలో పాల్గొంటున్నట్టుగా పరిగణిస్తాం" అని హెచ్చరించారు. ఉక్రెయిన్ మిలిటరీ మౌలిక సదుపాయాలను నాశనం చేయడం దాదాపు పూర్తయిందని పుతిన్ తెలిపారు.

భీకర దాడులతో విరుచుకుపడుతున్న రష్యాను కట్టడి చేసేందుకు తమ దేశాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రటించాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రతిపాదించారు. అయితే, నాటో దేశాలు దీన్ని తోసిపుచ్చాయి.

పదో రోజు యుద్ధం...

మరోవైపు, ఉక్రెయిన్‌పై పదో రోజూ రష్యా దండయాత్ర కొనసాగుతోంది. రాజధాని కీవ్‌, ఖర్కివ్‌, సుమీ నగరాలపై బాంబుల వర్షం కురిసింది. ఖర్కివ్‌, చెర్నిహివ్‌, మరియుపోల్‌, సుమీ నగరాలను రష్యా సేనలు చుట్టుముట్టగా.. ఉక్రెయిన్‌ బలగాలు దీటుగా ప్రతిఘటిస్తున్నాయి. జపోరిజియా అణువిద్యుత్‌ కేంద్రాన్ని ఉక్రెయిన్‌ తిరిగి స్వాధీనం చేసుకోగా.. రష్యా దాడుల్లో 28మంది తమ చిన్నారులు మృతిచెందినట్టు ఉక్రెయిన్‌ ప్రకటించింది. అలాగే, రష్యాకు చెందిన 10వేల మంది సైనికుల్ని అంతం చేసినట్టు తెలిపింది.

ఇదీ చదవండి:ఆగని దాడులు.. రష్యా చేజారిన న్యూక్లియర్ ప్లాంట్- భారీగా సైనికులు మృతి

ABOUT THE AUTHOR

...view details