రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీకి క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది రష్యా, భారత్‌లు నిర్మాణాత్మక ద్వైపాక్షిక బంధాలను మెరుగుపరుచుకునే విధంగా ముందుకు సాగాలని సందేశం పంపారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల విషయంలో పరస్పర సహకారం అందించుకోవాలని ఆకాంక్షించారు పుతిన్.
కోవింద్, మోదీలకు పుతిన్ సందేశం - రష్యా, భారత్‌ల బంధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ అభిప్రాయాలు
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు కొత్త సంవత్సరంలో ఇరు దేశాల బంధం మరింత పటిష్ఠం కావాలని ఆయన పంపిన సందేశంలో ఆకాంక్షించారు.
![కోవింద్, మోదీలకు పుతిన్ సందేశం Putin New year Greetings to India](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10065021-thumbnail-3x2-putin.jpg)
భారత్‌కు రష్యా అధ్యక్షుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఈ ఏడాది కరోనా వైరస్ సహా, అనేక ఇబ్బందులు తలెత్తినప్పటికీ ఇరు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యంతో అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. వివిధ రంగాల్లో భారత్, రష్యాలు ఉమ్మడి ప్రాజెక్టులను కొనసాగిస్తున్నాయని, షాంఘై కోఅపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ), బ్రిక్స్ సహకారం మంచి ఫలితాలనిస్తున్నట్లు క్రెమ్లిన్ పంపిన సందేశంలో పేర్కొంది.