తెలంగాణ

telangana

ETV Bharat / international

వచ్చే వారం రష్యాలో సామూహిక వ్యాక్సినేషన్! - కరోనా మాస్ వ్యాక్సినేషన్

వచ్చే వారాంతం నాటికి దేశంలో కరోనాకు సామూహిక వ్యాక్సినేషన్​ను ప్రారంభించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఆ దేశ ఉప ప్రధానని ఆదేశించారు. కొద్దిరోజుల్లోనే 20 లక్షల స్పుత్నిక్ వీ టీకాలను తయారు చేయనున్నట్లు తెలిపారు.

mass-vaccination-against-covid-in-russia-next-week
వచ్చే వారం రష్యాలో సామూహిక వ్యాక్సినేషన్!

By

Published : Dec 2, 2020, 9:17 PM IST

కరోనా నియంత్రణకు దేశంలో సామూహిక వ్యాక్సినేషన్ ప్రారంభించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు. వచ్చే వారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని దేశ ఉప ప్రధాని టాటియానా గోలికోవాకు ఆదేశాలు జారీ చేశారు.

"రానున్న రోజుల్లో 20 లక్షలకుపైగా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ డోసులను మేం తయారు చేస్తాం. ప్రపంచపు తొలి కరోనా టీకా ఇది. ప్రజలందరికీ కాకపోయినా, భారీ స్థాయిలో టీకా అందించేందుకు ఈ డోసులు ఉపయోగపడతాయి. ఇందుకోసం మనం సిద్ధంగా ఉన్నామని భావిస్తే.. సామూహిక వ్యాక్సినేషన్​ను వచ్చే వారం చివరి నాటికి ప్రారంభమయ్యేలా చూడండి."

-వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు

పుతిన్ ఆదేశాలు అమలుచేయడం సాధ్యమేనని ఉప ప్రధాని గోలికోవా పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగానే టీకాను స్వీకరించవచ్చని స్పష్టం చేశారు. వ్యాక్సిన్​ను ఉచితంగానే అందిస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details