కరోనా సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ ఇంగ్లాండ్ మాత్రం ఆంక్షల సడలింపునకే మొగ్గుచూపుతోంది. కొద్ది రోజులుగా మూతపడిన పబ్బులు, బార్లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, క్షౌరశాలలను దేశవ్యాప్తంగా తిరిగి ప్రారంభించింది. శనివారం నుంచి ఇవి అందుబాటులోకి వచ్చాయి.
వీధుల్లోకి జనాలు
కరోనా విజృంభిస్తున్నా బార్లు, రెస్టారెంట్లు రీఓపెన్ కరోనా నియంత్రణ కోసం విధించిన ఆంక్షలను సడలిస్తూ రెస్టారెంట్లు, బార్లు తెరవడానికి అనుమతి లభించడంపై చాలా మంది ఆనందం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి వేడుకలు జరుపుకున్నారు. కరోనా భయాలు వెంటాడుతున్నా చాలా మంది మాస్కులు లేకుండానే బయటకు రావడం ఆందోళన కలిగిస్తోంది.
విమర్శలు..
అమెరికా సహా ఐరోపా దేశాల్లో ఆంక్షలు ఎత్తివేసిన తరువాత కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. అయిన్నప్పటికీ ఇంగ్లాండ్ ప్రభుత్వం బార్లు, రెస్టారెంట్లు తెరిచేందుకు అనుమతివ్వడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
కొన్ని సందర్భాల్లో సాధారణంగానే భౌతిక దూరం పాటించరని.. పబ్బుల్లో మత్తు పదార్థాలు సేవించిన తరువాత అయితే.. పూర్తిగా ఉల్లంఘించే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విమర్శకులు. ఫలితంగా కరోనా మరింత ప్రబలే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
యూకేలో ఇప్పటి వరకు సుమారు 44 వేల మంది కరోనా బారినపడి మరణించారు. అమెరికా, బ్రెజిల్ తరువాత ఇదే అత్యధికం.
ఇదీ చూడండి: భూటాన్ మాదేనంటూ చైనా కొత్త కుట్రలు