కరోనా వైరస్‌పై ఓ సరికొత్త అధ్యయనాన్ని ప్రారంభించారు లండన్ సైకాలజిస్టులు. ఈ వైరస్ బారిన పడిన వ్యక్తి మానసిక స్థితి , అతడిపై సామాజిక ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై పరిశోధనలు చేస్తున్నారు.
వైరస్ సోకడం వల్ల సదరు వ్యక్తి ఇతరులతో ఎలా ప్రవర్తిస్తాడు? అతని ఆలోచన విధానం ఎలా ఉంటుంది? వంటి పలు విషయాలపై స్పష్టత కోసం ఈ అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు పరిశోధకులు. ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో వచ్చే ప్రజారోగ్య సమస్యలను ఎదుర్కొనడానికి సన్నద్ధంగా ఉండొచ్చని చెప్పారు. బాధితుల మానసిక స్థితి ఆధారంగా వైరస్ వృద్ధి, వ్యాప్తి ఎలా చెందుతుందో తెలుస్తుందని వివరించారు.