Russian attack on Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడాన్ని ఖండిస్తూ ప్రపంచవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుక్కాయి. లెబనాన్ నుంచి యూరప్ వరకూ లాటిన్ అమెరికా నుంచి చిలీ వరకూ ప్రజాందోళనలు జరిగాయి. రష్యాలోనూ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరగగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. పలువురు ప్రముఖులు కూడా ఈ నిరసనల్లో పాల్గొన్ని పుతిన్ యుద్ధాన్ని ఆపేయాలని నినదించారు.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడంపై ఆ దేశంలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. పుతిన్ చర్యపై రష్యన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యుద్ధానికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన ప్రజలు పుతిన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యుద్ధానికి తాము వ్యతిరేకం అంటూ ప్లకార్డులు, బ్యానర్లను ప్రదర్శించారు. పొరుగు దేశ ఆక్రమణను విరమించుకోవాలని వెంటనే సైన్యం తిరిగి రావాలని రష్యన్లు నినదించారు. మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్ యెకా టెరిన్‌బర్గ్‌తో సహా చాలా నగరాల్లో వందలాది మంది ర్యాలీలు నిర్వహించారు, ఉక్రెయిన్‌పై యద్ధానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటడంతో రష్యా ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దించింది. 53 పట్టణాల్లో సుమారు 17 వందల మందికిపైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఒక్క మాస్కోలోనే 6 వందల మందిని పోలీసులు అరెస్టు చేశారు.
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు పాల్పడుతోందంటూ అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఆందోళనలు జరిగాయి. ఉక్రెయిన్‌కు మద్దతుగా నినదించిన అమెరికన్లు పుతిన్ యుద్ధ కాంక్షతో పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని ప్లకార్డులు ప్రదర్శించారు. ఉక్రెయిన్ జెండాలను చేతబూని రష్యాకు వ్యతిరేకంగా నినదించారు.
బ్రిటన్‌లోనూ వందలాది మంది ఉక్రెయిన్‌కు మద్దతుగా నినదించారు. బ్రిటన్ ప్రధాన మంత్రి నివాసం ఎదుట ఉన్న డౌనింగ్ స్ట్రీట్ వెలుపల ఆందోళన నిర్వహించారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా బ్రిటన్ మరింత సాయం చేయాలని వారికి మద్దతుగా ఉండాలని నిరసనకారులు నినదించారు. ఫ్రాన్స్‌లోను యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు జరిగాయి. పారిస్‌లో నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లోని రష్యన్ రాయబార కార్యాలయం బయట ఆందోళనలు జరిగాయి. ఈ నిరసనల్లో ప్రముఖ నటుడు, ఆస్కార్ విజేత జేవియర్ బార్డెమ్ పాల్గొన్నారు. ఇదీ రష్యా చేసే దండయాత్రని, ఉక్రెయిన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తున్నారని బార్డెమ్ విమర్శించారు.
స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్‌లో వందలాది మంది ఉక్రెయిన్ జెండాలను పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. గ్రీస్ రాజధాని ఏథెన్స్‌లో ఉక్రేనియన్లు భారీ నిరసన ప్రదర్శన చేశారు. లెబనాన్ రాజధాని బీరుట్, ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్, ఐర్లాండ్ రాజధాని డబ్లిన్, చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్‌లలోనూ ఉక్రెయిన్‌కు మద్దతుగా ఆందోళనలు జరిగాయి.
ఇవీ చూడండి: