తెలంగాణ

telangana

ఖలిస్థాన్​ మద్దతుదారుల వీరంగం

By

Published : Mar 10, 2019, 10:51 AM IST

లండన్​లోని ప్రవాస భారతీయులపై ఖలిస్థాన్​ మద్దతుదారులు దాడి చేశారు. ఈ ఘటనలో అనేక మంది ఎన్​ఐఆర్​లకు తీవ్ర గాయాలయ్యాయి. పాకిస్థాన్​ ఐఎస్​ఐ ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగినట్లు అనుమానం.

లండన్​లో ఖలిస్థాన్​ మద్దతుదారుల వీరంగం

బ్రిటన్​​లో ఖలిస్థాన్​ మద్దతుదారులు రెచ్చిపోయారు. లండన్​లోని భారత హైకమిషనర్​ కార్యాలయం దగ్గరున్న ఎన్​ఆర్​ఐలపై దాడికి యత్నించారు. ఆ ప్రాంగణమంతా ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో పలువురు భారతీయులకు గాయాలయ్యాయి.

లండన్​లో ఖలిస్థాన్​ మద్దతుదారుల వీరంగం

దాడికి పాల్పడ్డవారు సిక్కు తలపాగా ధరించి ఉన్నారు. ఉర్దూలో నినాదాలు చేశారు. వీరి వెనుక ఐఎస్​ఐ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details