తెలంగాణ

telangana

By

Published : Jul 25, 2019, 10:29 AM IST

ETV Bharat / international

బ్రిటన్​ హోంమంత్రిగా భారత సంతతి మహిళ

బ్రిటన్​ హోంమంత్రిగా తొలిసారి భారత సంతతికి చెందిన వ్యక్తికి అవకాశం దక్కింది. మాజీ ప్రధాని థెరెసా మే  బ్రెగ్జిట్​ ఒప్పంద వ్యూహరచనలో కీలక పాత్ర పోషించిన ప్రీతి పటేల్​ ఈ పదవికి నియమితులయ్యారు.

బ్రిటన్​ హోంమంత్రిగా భారతీయ మహిళ

భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్​కు బ్రిటన్​లో అరుదైన గౌరవం దక్కింది. ఆ దేశ హోంమంత్రిగా ప్రీతి బాధ్యతలు చేపట్టారు. ఓ భారతీయ సంతతి వ్యక్తి ఈ పదవిని చేపట్టడం ఇదే తొలిసారి. బ్రిటన్​ ప్రధానిగా బోరిస్​ జాన్సన్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. గుజరాత్‌కు చెందిన ప్రీతి పటేల్​కు బోరిస్​ మంత్రివర్గంలో హోంమంత్రి భాధ్యతలు అప్పగించారు.

గతంలో హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పాకిస్థాన్ సంతతికి చెందిన సాజిద్​ జావిద్​ స్థానాన్ని భర్తీ చేశారు పటేల్​. నూతన మంత్రివర్గంలో జావిద్​ ఖజానా శాఖ మంత్రిగా నియమితులయ్యారు.

భద్రంగా... సురక్షితంగా

బ్రిటన్‌ను భద్రంగా, సురక్షితంగా ఉంచేందుకు కృషి చేస్తానని ప్రకటించారు ప్రీతి పటేల్. తన ముందున్న సవాళ్లను అధిగమిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
బ్రిటన్ నూతన ప్రధాని బోరిస్​ జాన్సన్​కు మద్దతుగా కన్సర్వేటివ్​ పార్టీ నిర్వహించిన 'బ్యాక్ బోరిస్'​ ప్రచార కార్యక్రమంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు ప్రీతి. మంత్రివర్గంలో ఆమెకు కీలక పదవి దక్కుతుందని ముందునుంచే ఊహాగానాలున్నాయి.
ఆధునిక బ్రిటన్​, ఆధునిక కన్సర్వేటివ్ పార్టీని ప్రతిబింబించేలా మంత్రివర్గం ఉండాలని బుధవారం తనకు పదవి కేటాయిచంకముందు తెలిపారు ప్రీతి.

కీలక పదవులు...

ఎస్సెక్స్​లోని విథమ్​ నియోజకవర్గం నుంచి 2010లో తొలిసారి కన్సర్వేటివ్​ పార్టీ ఎంపీగా ఎన్నికయ్యారు ప్రీతి పటేల్​.

2014లో ఖజానా శాఖ, 2015 సాధారణ ఎన్నికల అనంతరం ఉపాధి శాఖలకు సహాయ మంత్రిగా సేవలందించారు.

బ్రిటన్​ ప్రజల అంచనాలను జాన్సన్ అందుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు ప్రీతి.

ఇదీ చూడండి: బ్రిటన్​ ప్రధానిగా బోరిస్​ బాధ్యతల స్వీకరణ

ABOUT THE AUTHOR

...view details