బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పీపుల్స్ కేబినెట్లో భారతీయ సంతతి సభ్యులు ప్రీతి పటేల్, అలోక్ శర్మ, రిషి సునక్ తమ పదవులను నిలుపుకున్నారు.
బోరిస్ కేబినెట్లో ముగ్గురు భారత సంతతి మంత్రులు - Rishi Sunak
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయం సాధించిన బోరిస్ జాన్సన్.. తన మంత్రివర్గంలో ముగ్గురు భారతీయులకు మరలా అవకాశం కల్పించారు. ఫలితంగా ప్రీతి పటేల్, అలోక్ శర్మ, రిషి సునక్ తమ పదవులను నిలుపుకున్నారు.
![బోరిస్ కేబినెట్లో ముగ్గురు భారత సంతతి మంత్రులు Priti Patel, Alok Sharma, Rishi Sunak in Boris Johnson's ‘People's Cabinet'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5408395-thumbnail-3x2-indians.jpg)
బ్రెగ్జిట్ ప్రధాన అంశంగా జరిగిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో బోరిస్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ 80 సీట్ల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. కాగా కొత్తగా ఎన్నికైన సభ్యులు మంగళవారం మొదటి పార్లమెంట్ సమావేశానికి హాజరయ్యారు.
బోరిస్ కేబినెట్లో.. బ్రిటన్ హోంశాఖ కార్యదర్శిగా ప్రీతి పటేల్ మరోమారు తన స్థానాన్ని నిలుపుకున్నారు. అలోక్ శర్మ అంతర్జాతీయ అభివృద్ధిశాఖ బాధ్యతలు చేపట్టారు. ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్ ట్రెజరీ చీఫ్ సెక్రటరీగా తన పదవిని నిలబెట్టుకున్నారు. ఈయన గత ప్రభుత్వంలో యూకే పాక్ సంతతి ఛాన్సలర్ సాజిద్ జావిద్తో కలిసి పనిచేశారు.