కేట్ తీరు వల్ల తాను ఏడ్చానని ప్రిన్స్ హ్యరీ భార్య మేఘన్ వెల్లడించినా.. కేట్నే సమర్థించారు ఆమె భర్త ప్రిన్స్ విలియమ్స్. బ్రిటన్ రాజకుటుంబంలోని ప్రస్తుత పరిస్థితులను ఈ మేరకు పీపుల్స్ మ్యాగజైన్ వెల్లడించింది. అమెరికాలోని పాపులర్ టీవీ షో ఓఫ్రా విన్ఫ్రే కార్యక్రమంలో ప్రిన్స్ హ్యారీ మేఘన్ దంపతలు బ్రిటన్ రాజకుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై విలియమ్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పేర్కొంది.
అయినా కేట్నే సమర్థించిన ప్రిన్స్ విలియమ్స్!
కేట్..ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ను ఇబ్బంది పెట్టారని తెలిసినా.. కేట్నే.. ప్రిన్స్ విలియమ్స్ వెనకేసుకొచ్చినట్లు పీపుల్స్ మ్యాగజైన్ వెల్లడించింది. బ్రిటన్ రాజకుటుంబంపై ప్రిన్స్ హ్యారీ దంపతులు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారని పేర్కొంది.
ఆ ఆరోపణల తర్వాత కేట్కు మద్ధతుగా నిలిచిన ప్రిన్స్ విలియమ్స్!
రాజకుటుంబం నుంచి విడిపోయిన మేఘన్, హ్యారీ దంపతులు ఇటీవల ఓ టీవీ షోలో మాట్లాడారు. హ్యారీని పెళ్లి చేసుకుని బ్రిటన్ రాజకుటుంబంలోకి అడుగుపెట్టాక ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెప్పారు మేఘన్ మార్కెల్. ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషయాలు బ్రిటన్ రాజకుటుంబంలో పెను దుమారం రేపాయి.
ఇదీ చదవండి:'రాజకుటుంబంలోకి వచ్చాక చచ్చిపోదామనుకున్నా'