తెలంగాణ

telangana

By

Published : Apr 11, 2021, 5:44 AM IST

ETV Bharat / international

ఏప్రిల్​ 17న ప్రిన్స్​ ఫిలిప్ అంత్యక్రియలు

శుక్రవారం మరణించిన బ్రిటన్ యువరాజు​ ప్రిన్స్ ఫిలిప్​ అంత్యక్రియలను ఈనెల 17న నిర్వహించనున్నట్లు బకింగ్​హామ్ ప్యాలెస్ తెలిపింది. ఈ కార్యక్రమానికి బయటి వారిని అనుమతించడం లేదని పేర్కొంది.

Prince Philip's funeral
ఏప్రిల్​ 17న ప్రిన్స్​ ఫిలిప్ అంత్యక్రియలు

బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఫిలిప్​కు నివాళులర్పిస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శనివారం గన్​ సెల్యూట్​తో గౌరవ వందనం చేశారు. ఆయన అంత్యక్రియలు ఏప్రిల్ 17న నిర్వహించనున్నట్లు లండన్​లోని బకింగ్​హామ్​ ప్యాలెస్​ పేర్కొంది. ప్రిన్స్​ కుటుంబీకులు 30 మంది మాత్రమే అంతిమ సంస్కారాలకు హాజరుకానున్నట్లు స్పష్టం చేసింది.

బ్రిటన్​ కాలమానం ప్రకారం ఏప్రిల్ 17 మధ్యాహ్నం 3 గంటలకు.. ఒక నిమిషం జాతీయ మౌనం అనంతరం ప్రిన్స్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆగ్నేయ ఇంగ్లాండ్​లోని క్వీన్​ రాజనివాసంలో ఈ కార్యక్రమం జరగనుంది.

ఇదీ చదవండి:ఇండోనేసియాలో భూకంపం- 8 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details