తెలంగాణ

telangana

ETV Bharat / international

లండన్​లోని వేరే ఆస్పత్రికి బ్రిటన్​ రాజకుమారుడు - రాజకుమారుడు ఫిలిప్​ ఆస్పత్రి మార్పు

బ్రిటన్​ రాజకుమారుడు ఫిలిప్​ను మరో ఆస్పత్రికి మార్చినట్టు బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ వెల్లడించింది. 99 ఏళ్ల ఫిలిప్​.. గత నెల 17న అస్వస్థతకు గురయ్యారు.

Prince Philip
బ్రిటన్​ రాజకుమారుడు ఫిలిప్​

By

Published : Mar 1, 2021, 7:20 PM IST

అనారోగ్యం బారినపడి​ ఆస్పత్రిలో చేరిన బ్రిటన్​ రాజకుమారుడు ఫిలిప్​ను వేరొక వైద్యశాలకు మార్చినట్టు బకింగ్​హామ్​ ప్యాలెస్​ తెలిపింది. క్వీన్​ ఎలిజబెత్​-II భర్త అయిన 99 ఏళ్ల ఫిలిప్​.. ఫిబ్రవరి 17న అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన లండన్​లోని కింగ్​ ఎడ్వర్డ్-VII ఆస్పత్రిలో చేరారు.

మెరుగైన వైద్యం కోసమే లండన్​లోని సెయింట్​ బార్తోలొమ్యూస్​ ఆస్పత్రికి మార్చినట్టు ప్యాలెస్​ పేర్కొంది. అయితే.. ఆయనకు కరోనా సోకలేదని గుండె సంబంధిత పరీక్షల కోసమే ముందు జాగ్రత్తగా ఆస్పత్రిలో చేర్పించినట్టు వివరించింది.

ఇదీ చదవండి:అరుదైన బటన్లతో మ్యూజియం.. ఎక్కడంటే?

ABOUT THE AUTHOR

...view details