బ్రిటన్ రాజకుటుంబంలో ఉంటూ తానెంతో నలిగిపోయానని.. అక్కడ ఎవరూ తనను పట్టించుకోలేదని ప్రిన్స్ హ్యారీ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. అమెరికా టీవీ యాంకర్ ఓప్రా విన్ఫ్రేకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో మద్యానికి తాను ఎలా బానిసైందీ హ్యారీ వివరించారు. తల్లి డయానా మరణం తనను మానసికంగా ఎంత కుంగదీసిందీ తెలిపారు. తన భార్య మేఘన్ మార్కెట్ కూడా తల్లి డయానాలా ఇబ్బంది పడుతుందన్న ఆందోళన తనను వెంటాడేదని అన్నారు. మానసికంగా మేఘన్ పరిస్థితి బాగా లేనప్పుడు తన కుటుంబం ఎలాంటి సాయం చేయలేదని తెలిపారు.
"నేను చేసిన విజ్ఞప్తిని, హెచ్చరికను దేన్నీ రాజకుటుంబం పట్టించుకోలోదు. నిర్లక్ష్యం వహించారు. 28 నుంచి 32 ఏళ్ల వయసులో నేను మానసికంగా కుంగిపోయాను. తాగాలనిపించేది. మాదక ద్రవ్యాలు తీసుకోవాలనిపించేది. వారంలో తాగాల్సిన మద్యాన్ని ఒకే రోజులో తాగిన సందర్భాలూ ఉన్నాయి."